గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ నుంచి ఓ వీడియోను షేర్ చేసుకున్నారు. శంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీ పై చాలా మంచి అంచాలున్నాయి. అయితే ఈ మూవీ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు రానుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న రిలీజ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. రామ్ చరణ్ తన షూటింగ్ లో భాగంగా రామ్ చరణ్ తన సినిమా లో మేకింగ్ డేస్ ను రిలజీ్ చేశారు.
గేమ్ ఛేంజర్ షూటింగ్ రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. చిత్రబృందంతో షూటింగ్‌లో పాల్గొన్న క్షణాలను వీడియో రూపంలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు.
#Gamechanger #JaanaHairaanSa @shankarshanmugh @advani_kiara @BoscoMartis @DOP_Tirru @MusicThaman @AalimHakim @ManishMalhotra pic.twitter.com/Ei3mMAgPHF — Ram Charan (@AlwaysRamCharan) December 10, 2024