‘ఇండియాకు తిరిగి వెళ్లకుండా మిమ్మల్ని ఏం ఆపుతున్నది?’ అని క్వశ్చన్ చేస్తే ఏముంది ఇండియాలో చుట్టాలుంటారు..ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయి. కాని ఫైనాన్షియల్ గా సేఫ్టీ ఉండదు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : అమెరికా, కెనడా, దేశం ఏదైనా కాని పరాయి దేశమే మన వాళ్ల డ్రీమ్. పరాయి దేశంలో డాలర్లు సంపాదించడం మన వాళ్లకు ఎంతో ఆనందాన్ని ఇవ్వడమే కాదు ..చాలా గౌరవం కూడా. ఇంట్లో వాళ్లు ...సొంత ఊరు, సొంత మనుషులను వదిలేసి ఎక్కడో ఉండడం కష్టమే అయినా ఎందుకు ఇండియా కు రారు అనే ప్రశ్న అందరికి వస్తుంది. అయితే ఇదే ప్రశ్న పై ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం రెడ్డిట్ లో ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. యూకేలో స్థిరపడిన ఎన్ఆర్ఐ ఒకరు తన పోస్టులో ‘ఇండియాకు తిరిగి వెళ్లకుండా మిమ్మల్ని ఏం ఆపుతున్నది?’ అని క్వశ్చన్ చేస్తే ఏముంది ఇండియాలో చుట్టాలుంటారు..ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయి. కాని ఫైనాన్షియల్ గా సేఫ్టీ ఉండదు.
వర్క్ కల్చర్ ఉండదు. పనివేళలు సరిగ్గా ఉండవు. ఫ్యామిలీ లైఫ్ అసలు బాగోదు. ఇక్కడైతే ఎంత పెద్ద కంపెనీ అయినా పనివేళలు అసలు మార్పు ఉండదు. ఎక్స్ ట్రా గా పనిచెయ్యాల్సిన అవసరం ఉండదు. చేసినా మన కష్టానికి తగిన ఫలితం మన జీతంలో కనిపిస్తుంది.
మనకు నచ్చిన ఉద్యోగం మనం చెయ్యడానికి ..మనం కెరియర్ లో ఎదగడానికి ప్రతి ఒక్కడు బాస్ లా వ్యవహరిస్తాడు. యూఎస్ లో అలా కాదు నీదగ్గర టాలెంట్ ఉంటే ...ఏం చేసినా నిన్ను ఆపలేరు. ఇక్కడున్న వసతులు మన దేశంలో లేవని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసమని మరికొందరు, నేరాలకు దూరంగా ప్రశాంతంగా, ధైర్యంగా బతకడం కోసమని ఇంకొందరు చెబుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ, రోడ్ల పరిస్థితి, ఇండియన్లలో సివిక్ సెన్స్ తక్కువని, కాలుష్యంలేని వాతావరణం కోసమని, పరిశుభ్రమైన నీరు, ఆహారం, మన దగ్గరి నుంచి వసూలు చేసే పన్నులు మన కోసమే ఉపయోగపడతాయని ఇలా వందకు పైగా కారణాలు తెలిపారు. ఇందుకే తిరిగి భారత్ వచ్చేయాలంటే భయంగా ఉందని మరికొందరు కామెంట్లు చేశారు. వార్ని ఇదా సీక్రెట్ అని కూడా అంటున్నారు.