Rajinikanth: ఒకే ఫ్రేమ్‌లో రజనీకాంత్, మోహన్‌బాబు

Published 2024-07-05 02:19:57

postImages/2024-07-05/1720163312_1144397447rajinikanthmohanbabuairportjpg1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోహన్ బాబు గారి గురించి తెలసిందేగా..తమిళసూపర్ స్టార్ రజినీ కాత్ , కలక్షన్ కింగ్ మోహన్ బాబు ...ఎంత మంచి ఫ్రెండ్స్ . ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూల్లో చెబుతూనే ఉంటారు కూడా. మోహన్‌బాబు చెన్నై వెళ్లినా, రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినా ఒకరినొకరు కలుసుకోకుండా వెళ్లడం అనేది ఉండదు. అంత మంచి ఫ్రెండ్స్. 


పెదరాయుడు సినిమాలో కలిసి నటించిన తర్వాత ఇద్దరూ కలిసి మరో సినిమా చేసే అవకాశం రాలేదు. అలాంటి కథతో ఎప్పుడు ఏ డైరక్టర్ తన ముందుకు రాలేదని కూడా చాలా సార్లు చెప్పారు. అయితే వీళ్లిద్దరు ఓకే ఫ్లైట్ లో పక్కపక్కన కూర్చొని ప్రయాణఇస్తున్న ఫొటో ఒకటి సోషల్ ీమడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.  అంత క్లోజ్ గా ఫ్లైట్ లో ఎక్కడకి వెళ్తున్నారు కొత్త సినిమానా ఏంటి  సార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.


ఈ ఫొటోను షేర్ చేసిన మోహన్‌బాబు.. ‘అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా స్నేహమేరా జీవితం’ అని క్యాప్షన్ తగిలించారు. మోహన్‌బాబు ను గట్టిగా పట్టుకున్న రజనీకాంత్ స్మైలీఫేస్ కోసం పెదవులను విప్పుతున్నట్టుగా ఉన్న ఈ ఫొటోపై నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. సూపర్‌స్టార్‌ను, కలెక్షన్ కింగ్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూడడం బాగుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.   అయితే ఆ కధ ఏ డైరక్టర్ రాస్తాడో చూడాలంటున్నారు నెటిజన్లు.