సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలి ఢిల్లీ పర్యటనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీ వెళ్లిన రేవంత్ అక్కడ అఫీషియల్‌గా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలవలేదు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులను కలుస్తానని
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలి ఢిల్లీ పర్యటనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీ వెళ్లిన రేవంత్ అక్కడ అఫీషియల్‌గా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలవలేదు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులను కలుస్తానని చెప్పినా.. ఎవరిని కలవలేదు. అయితే.. అపాయింట్ మెంట్ దొరకకపోవబడంతో తిరిగి వచ్చారని అంతా అనుకున్నారు. కానీ చీకట్లో చంద్రుడి మాదిరిగా ఆయన యవ్వారమంతా సీక్రెట్ గా కానిచ్చేశారట. ఢిల్లీ వెళ్లిన ఆయన తన సీక్రెట్ మిషన్ ను కంప్లీట్ చేసుకున్నాకే తిరిగి హైదరాబాద్ కు వచ్చారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.
ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఇదే సమయంలో కవిత బెయిల్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సుప్రీంకోర్టు కూడా చీవాట్లు పెట్టింది. ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తామని హెచ్చరించింది. దీంతో ఆయనకు ముచ్చెమటలు పట్టాయట. కేసు రాష్ట్రం దాటిపోతే.. వ్యవహారం మారిపోతుందని టెన్షన్ పడ్డారట. దీంతో వరదసాయం సాకు చెప్పి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారని గాంధీ భవన్ లోనే ప్రచారం జరుగుతోంది.
కేవలం మీడియాతో చిట్ చాట్ చేయడానికి ఢిల్లీ వరకు వెళ్లారా.? అని విమర్శలు వచ్చాయి. కానీ ఢిల్లీలో RSSకు చెందిన కీలక నేతలను సీక్రెట్‌గా కలిశారనే చర్చ అక్కడి మీడియా, రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ఈ వ్యవహారం అంతా బీజేపీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జరుగుతోందన్న ప్రచారం కూడా ఉంది. ఈ కేసులో రేవంత్ దోషిగా తేలితే తను కూడా ఈ కేసులో ఇరుక్కునే అవకాశం ఉండటంతో.. తన శిష్యుడిని కాపాడేందుకు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ మధ్య ఇద్దరు నేతలు వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
బాబు చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారని, ఆయన చెప్పడంతోనే RSS నేతలతో సంప్రదించి ఈ కేసు నుంచి తనను తప్పించేందుకు సాయం చేయాలని కోరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ ఒక్కసారే ఆర్ఎస్ఎస్ నేతలను కలిశారా.? వెళ్లిన ప్రతీసారి కలిసి వస్తున్నారా.? అన్న ఊహాగానాలు జోరుగా నడుస్తున్నాయి. వాళ్లను నమ్మించేందుకే అనేక సందర్భాల్లో తాను RSSలో పని చేశానని బహిరంగ సభల్లోనూ రేవంత్ చెబుతున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఓటుకు నోటు కేసు ఏ మలుపు తిరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది.