రొనాల్డో కూడా ఓ యూట్యూబర్ కూడా. అయితే అతని యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసుకుందామా.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: యూట్యూబ్ ఒకప్పుడు టైం పాస్ ..ఇప్పుడు బిజినెస్ , డబ్బులు ..స్టార్స్ అయితే వారి ప్రతి వీడియోకి కొంత రెవెన్యూ తప్పకుండా ఇస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని జనాలు యూట్యూబ్ మీదే ఆధారపడుతున్నారు. అయితే లిస్ట్ లో రొనాల్డ్ కూడా ఉన్నారు. రొనాల్డో కూడా ఓ యూట్యూబర్ కూడా. అయితే అతని యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసుకుందామా.
ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఛానెల్ స్టార్ట్ చేసిన 90 నిమిషాల్లోనే 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్నాడు. ఆగస్టు 21న తన ఛానెల్‌ను ప్రారంభించిన 90 నిమిషాల్లోనే 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్నాడు. అంతేకాదు జస్ట్ 12 వీడియోలు పోస్ట్ చేశాడు అంతే. కాని రెవెన్యూ మాత్రం 3 లక్షల డాలర్లు వచ్చాయట. ఈ విషయాన్ని తన ఇన్ స్టా ద్వారా రొనాల్డో తెలిపాడు.
క్రిస్టియానో రొనాల్డో కేవలం ఒక్క రోజులో 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకోవడమే కాకుండా, గోల్డెన్ ప్లే బటన్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.సాధారణ యూట్యూబర్ కు ఇది ఎన్నో యేళ్లు కష్టపడితే కాని రాదు. ఇప్పటికే 5 కోట్ల లైకులు వచ్చాయి. ఒక్కరోజులోనే అతను 3 లక్షల డాలర్లను ఆర్జించాడని ఇంటర్నేషనల్ మీడియా కథనాలు నడుస్తున్నాయి. ఇప్పటికే రొనాల్డో ఆస్తులు 800 మిలియన్ డాలర్ల నుంచి 950 మిలియన్ల డాలర్ల మధ్య ఉంటుందనేది మీడియా అంచనా. మొత్తానికి ఇంత ఫాస్ట్ గా టార్గెట్ ని రీచ్ అయ్యి గోల్డ్ ప్లే బటన్ తీసుకోవడం రొనాల్డే వల్లే కుదిరింది.