Samantha:పవన్ కళ్యాణ్ వద్దకు సమంత..ఆ పని కోసమేనా.?

Published 2024-07-05 13:14:35

postImages/2024-07-05/1720165475_sam.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా కథానాయక సమంతా అంటే తెలియని వారు ఉండరు. ఈమె ఏం మాయ చేసావే అనే మూవీ ద్వారా  తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి  ఆ తర్వాత మహేష్ బాబుతో దూకుడు అనే చిత్రంలో నటించి స్టార్ గా మారిపోయింది. అలాంటి సమంత  ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో దూసుకుపోతోంది.  ఇదే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టిన ఈ బ్యూటీ చివరికి నాగచైతన్యతో ప్రేమలో పడి వివాహం కూడా చేసుకుంది. కానీ వీరి వివాహం  మూన్నాళ్ళ ముచ్చటగానే ముగిసింది. వీరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు.

సమంత పెళ్లికి ముందు స్టార్ గా దూసుకుపోయింది. ఎలాంటి సమస్యలు లేకుండా హ్యాపీగా జీవించింది. పెళ్లి చేసుకొని ఎప్పుడైతే విడిపోయిందో ఇక సమస్యల ఊబిలో చిక్కుకుంది. సినిమాల పరంగా ఆమెకి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఎన్నో అనారోగ్య సమస్యలు ఆమెను వెంటాడుతూ వస్తున్నాయి.  ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మయోసైటిస్ వ్యాధి. ఈ వ్యాధితో ఆమె పడరాని పాట్లు పడుతోంది. ఇతర దేశాలు వెళ్లి ట్రీట్మెంట్ కూడా తీసుకుంది. ప్రస్తుతం ఓ మోస్తారుగా ఆరోగ్యం బాగానే ఉన్నా సమంత పలు వెబ్ సిరీస్ ల్లో, సినిమాలు చేస్తోంది.

అలాంటి ఈ బ్యూటీ  పవన్ కళ్యాణ్ ను కలవబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పలువురు సెలబ్రిటీలు కలుస్తూ ఉన్నారు. ఇదే తరుణంలో సమంత కూడా ఆయనను కలిసి పలు విషయాలపై చర్చించనుందట. మరి ఆమె పవన్ కళ్యాణ్ ను ఎందుకు కలుస్తుందో ఇప్పుడు చూద్దాం.. అయితే సమంతకు చెట్లు, ప్రకృతి అంటే ఎంతో ఇష్టం.

ఆమె ఎప్పుడు వెకేషన్స్ కు వెళ్లిన పచ్చని పొలాలు చెట్ల మధ్యనే ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటుంది. చెట్లను నరికే వారంటే ఆమెకు పరమ అసహ్యం. చెట్లను కాపాడాలి చెట్లు పెంచాలి అంటూ ఎప్పుడు అంటుంది. అంతే కాదు మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తినాలి  అంటూ చెబుతుంది.. ఈ విధమైన విషయాలు  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చించడం కోసం ఆయనను కలవనుందట.  అంతేకాదు ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడానికి పవన్ సహాయం కూడా తీసుకుంటుందని తెలుస్తోంది. మరి సమంతకు పవన్ అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.