Girl: చిన్నారిపై లైంగిక వేధింపులు

ఉప్పల్ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్లో చిన్నారి లైంగిక వేధింపులు ఎదురుకుంది.


Published Aug 02, 2024 07:16:43 AM
postImages/2024-08-02/1722597849_assfi.PNG

న్యూస్ లైన్ డెస్క్: ఉప్పల్ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్లో చిన్నారి లైంగిక వేధింపులు ఎదురుకుంది. రెండవ తరగతి చిన్నారిపై తొమ్మిదో తరగతి విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేశారు. చదువుకోవడానికి పంపించిన చిన్నపిల్లపై అసభ్యంగా ప్రవర్తించడం ఏంటీ అంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల వేధింపులకు గురవుతుంటే స్కూల్ యాజమాన్యం ఏం చేసిందని నిలదీశారు.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ విషయంలో తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్ధి సంఘాల నాయకులు లిటిల్ ఫ్లవర్ స్కూల్ ముందు పెద్ద ఎత్తున్న ధర్నా నిర్వహించారు. వెంటనే విద్యాశాఖ అధికారి స్పందించి పాఠశాల యాజమాన్యం పై కేసు పెట్టి అరెస్టు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసలు విద్యార్ధి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana students police girls school

Related Articles