Sivakarthikeyan: తన కొడక్కి టాలీవుడ్ హీరో పేరు పెట్టిన శివకార్తికేయ!

తన మూడో బిడ్డ పేరు పవన్ అని రివీల్ చేశాడు. ‘పవన్ శివకార్తికేయన్’ అని పెట్టారు.ఇంకేముంది పవన్ కళ్యాణ్ లో పవన్ పెట్టారంటు పవన్ ఫ్యాన్స్ ఖుషీ పడుతున్నారు. శివకార్తికేయన్ చివరిగా ‘అయలాన్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన తర్వాత సినిమా మేజన్ ముకుందన్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘అమరన్’తో ఆడియన్స్‌ను ఆకట్టుకోవడానికి సిద్దమవుతున్నాడు.


Published Jul 15, 2024 04:31:00 PM
postImages/2024-07-15/1721041424_ShivaKarthikeyan.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తమిళ హీరో శివకార్తికేయన్ కు రీసెంట్ గానే ఓ బాబు పుట్టాడు. ఈ విషయాన్ని హీరోనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపాడు. నామకరణం వీడియో కూడా పోస్ట్ చేసి తన హ్యాపీ నెస్ ను ...ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. శివకార్తికేయన్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండకపోయినా అప్పుడప్పుడు తన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు


తన ఇంట్లోనే జరిగిన ఈ వేడుకకు కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ నామకరణం వీడియోతో పాటు తన భార్య ఆర్తీని తలుచుకొని తన పై ప్రేమను ట్వీట్టర్ వేదికగా తెలిపాడు ..‘ఆర్తీ.. నువ్వు ఆపరేషన్ థియేటర్‌లో మన పిల్లలకు డెలివరీ ఇచ్చేటప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను. నువ్వు పడిన బాధ ఏంటో దగ్గరుండి చూశాను. నాకు ఇంత అందమైన ప్రపంచం ఇవ్వడం కోసం నువ్వు పడిన బాధకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. లవ్ యూ’ అని రాసుకొచ్చాడు. ఈ చిన్న మెసేజ్ ఆర్తీని వందేళ్లు ఆరోగ్యంగా బతికేలా చేస్తుందంటున్నారు శివకార్తికేయ లేడీ ఫ్యాన్స్. భార్య కష్టాన్ని గుర్తించే భర్త నిజమైన గొప్పవాడంటున్నారు.


తన మూడో బిడ్డ పేరు పవన్ అని రివీల్ చేశాడు. ‘పవన్ శివకార్తికేయన్’ అని పెట్టారు.ఇంకేముంది పవన్ కళ్యాణ్ లో పవన్ పెట్టారంటు పవన్ ఫ్యాన్స్ ఖుషీ పడుతున్నారు. శివకార్తికేయన్ చివరిగా ‘అయలాన్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన తర్వాత సినిమా మేజన్ ముకుందన్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘అమరన్’తో ఆడియన్స్‌ను ఆకట్టుకోవడానికి సిద్దమవుతున్నాడు.

newsline-whatsapp-channel
Tags : movie-news tamilanadu fans

Related Articles