ఇప్పటికే తండేల్ సినిమా నుంచి టీజర్, బుజ్జితల్లి సాంగ్ రిలీజ్ చేయగా అవి బాగా వైరల్ అయ్యాయి. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నాగచైతన్య , సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న తండేల్ సినిమా లో శివ శక్తి సాంగ్ ను రిలీజ్ చేశారు మూవీ టీం. గీత ఆర్ట్స్ బ్యానర్ పై లో బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే తండేల్ సినిమా నుంచి టీజర్, బుజ్జితల్లి సాంగ్ రిలీజ్ చేయగా అవి బాగా వైరల్ అయ్యాయి. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.
తండేల్ సినిమా నుంచి శివుడి సాంగ్ ని రిలీజ్ చేశారు. నమో నమో నమః శివాయ..’ అంటూ సాగిన శివశక్తి పాట ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ పాట జొన్న విత్తులరామలింగేశ్వరావు రాయగా దేవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో తెలుగులో అనురాగ్ కులకర్ణి , హరిప్రియ అధ్భుతంగా పాడారు. హిందీలో దివ్య కుమార్ సలోని థక్కర్ ఈ సాంగ్ ను పాడారు.
ఈ సాంగ్ ని తెలుగు , తమిళ్ , హిందీ బాషల్లో రిలీజ్ చేశారు. అయితే సాంగ్ లిరిక్స్ తో సాటు ట్యూనింగ్ బాగుందంటున్నారు సాయిపల్లవి ఫ్యాన్స్ . గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7 న రిలీజ్ అవుతుంది.