hmpv: 'హెచ్​ఎంపీవీ వైరస్ కోసం పూర్తి వివరాలు ..ఎంత డేంజర్ !

అయితే వాస్తవానికి హెచ్ఎంపీవీ అంత ప్రమాదకరం కాదని గతంలోనూ భారత్​లో ఈ తరహా కేసులు నమోదవుతూనే ఉన్నాయంటున్నారు వైద్యులు.


Published Jan 06, 2025 10:18:00 PM
postImages/2025-01-06/1736182269_1736133489123478.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్; hmpv  వైరస్ గురించి జనాలు చాలా భయపడుతున్నారు. మరి కోవిడ్ సెకండ్ వేవ్ ఇచ్చిన జర్క్ అలాంటిది. కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. స్థిరపడుతున్నామనుకున్నవారు..ఆస్తులు అమ్ముకున్నారు. ఎందరో కుటుంబ పెద్దలు కన్నుమూశారు. కొన్ని కుటుంబాలు పేరెంట్స్ ఇద్దరిని పోగొట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితులు చూసిన వారిలో ఈ వైరస్ మరో సారి వెన్నులో వణుకుపుట్టిస్తుంది.


అయితే వాస్తవానికి హెచ్ఎంపీవీ అంత ప్రమాదకరం కాదని గతంలోనూ భారత్​లో ఈ తరహా కేసులు నమోదవుతూనే ఉన్నాయంటున్నారు వైద్యులు. ఈ వైరస్ ను చైనాలో 2001 లో కనిపెట్టారట. కాకపోతే మందు లేదు...చాలా మంది సాధారణ ఫ్లూ తో వచ్చిన చిన్న చిన్న శ్వాసకోశ సంబంధింత ఇబ్బందులు పడతారు. కాని క్యూర్ చాలా వరకు ఉంటుంది. 


 ఇది ఒక సీజనల్ ఎఫెక్ట్ మాత్రమే. దీంతో ఎలాంటి ప్రమాదం లేదు. దీనిని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. అసలు అంత సీరియస్ కాదు ..కాని మీరు మాస్క్ వేసుకొండి. మీ జాగ్రత్తలు మరిచిపోతేనే పరిస్థితి సీరియస్ అవుతుంది. కొత్త వైరస్‌ అంశాన్ని డబ్ల్యూహెచ్‌వో కూడా పరిశీలిస్తోందని అన్నారు. హెచ్‌ఎంపీవీ కేసులపై ఐసీఎంఆర్‌ సమీక్షిస్తోందని, చైనా సహా పొరుగు దేశాల్లో పరిస్థితిని గమనిస్తున్నట్లు తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-news india danger

Related Articles