ఇవాల్టి సాయంత్రం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రి అసోసియేషన్ ప్రకటన చేయడం జరిగింది.
న్యూస్ లైన్, సపెషల్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు షాకింగ్ వార్తే వినిపిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ లో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ చేసే ఆలోచనలో ఉన్నారు అధికారులు. ఇవాల్టి సాయంత్రం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రి అసోసియేషన్ ప్రకటన చేయడం జరిగింది. అలాగే ఓపీ సేవలు , హెచ్ ఎస్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. హాస్పిటల్ అసోసియేషన్. చంద్రబాబు కూటమి ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోతే ఈ నెల 26వ తేదీ నుంచి అత్యవసర సేవలు కూడా బంద్ చేస్తామని చెబుతున్నారు. గత ప్రభుత్వం తమకు 3000 కోట్లు బకాయిలు ఉన్నారని అవి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసనకు దిగింది హాస్పటిల్ అసోసియేషన్ . అయితే ఇది పూర్తిగా ఆసుపత్రి అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం . కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.