flight : ఫ్లైట్ లో కొబ్బరికాయ తీసుకెళ్లకూడదని తెలుసా ?

ఫ్లైట్ జర్నీలో బ్యాగేజీని తీసుకెళ్లే విషయంలో విమానయాన సంస్థలు కొన్ని కండిషన్స్ పెడుతుంది. 


Published Aug 06, 2024 05:51:00 PM
postImages/2024-08-06/1722947090_coconut.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఫ్లైట్ జర్నీలో బ్యాగేజీని తీసుకొని వెళ్లే విషయంలో ఎంత జాగ్రత్తలు పాటించాలి. ముందే ఏం తీసుకొని వెళ్లాలో ..తీసుకొని వెళ్లకూడదో చూసుకోవాలి లేదంటే డస్ట్ బిన్ కు చేరుకుంటాయి. అందుకే ఏం తీసుకొని వెళ్లాలి..ఏం తీసుకొని వెళ్లకూడదు ముందే తెలుసుకోవాలి.ఫ్లైట్ జర్నీలో బ్యాగేజీని తీసుకెళ్లే విషయంలో విమానయాన సంస్థలు కొన్ని కండిషన్స్ పెడుతుంది. 


చాలా వస్తువులు తీసుకొని వెళ్లకూడదు...పదునైన వస్తువులు , బ్యాటరీలు , నిత్యం పూజ కోసం వాడే అగ్గిపెట్టెలు కూడా తీసుకొని వెళ్లకూడదు. అంతేకాదు విమానాల్లో టెంకాయ తీసుకొని వెళ్లడం నిషేధం. ఎందుకో తెలుసా విమానాల్లో కొబ్బరికాయ తీసుకెళ్లడం చాలా ప్రమాదం. టెంకాయ వల్ల ఫ్లైట్ లో అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉంది. 


టెంకాయ నీరు ఎక్కువ కదలడం వల్ల ..లేదా ఎక్కువ రోజులు ఉండడం వల్ల కూడా నీరు పులుపు చేరి  చిన్నపాటి గ్యాస్ ఫామ్ అవుతుందట. విమాన ప్రయాణాల్లో చిన్నపాటు పేలుడు సంభవించినా ..వందల మంది ప్రాణాలు రిస్క్ లో పెట్టడం కాబట్టి వాటిని  అవాయిడ్ చేస్తారట విమాన సర్వీస్ వాళ్లు. అందుకే ఫ్లైట్ జర్నీలో కొబ్బరికాయ పట్టుకొని వెళ్లకూడదు 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu coconut- flight life-style

Related Articles