sonia parents: బిగ్ బాస్ వల్ల నా కూతురు పేరు, పరువు పోయేలా ఉంది !

ఎప్పుడైతే బిగ్ బాస్ లో నిఖిల్ తో ఫ్రెండ్ షిప్ ..పృథ్వీ తో గ్యాంగ్ క్రియేట్ అయ్యిందో ..సోనియా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. 


Published Sep 22, 2024 10:57:00 PM
postImages/2024-09-22/1727026121_soniaakulaparents.jpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ లో సోనియా ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ కు ముందు సినిమాలు చేసినా పెద్దగా ఫేమ్ రాలేదు. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ లో నిఖిల్ తో ఫ్రెండ్ షిప్ ..పృథ్వీ తో గ్యాంగ్ క్రియేట్ అయ్యిందో ..సోనియా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. 


కొంతమంది నెటిజన్లు ఆమెను అదే పనిగా టార్గెట్ చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా సోనియాతో హౌస్ లో చనువుగా ఉంటోన్న నిఖిల్, పృథ్వీలతో ఆమెకు రిలేషన్ అంటగడుతున్నారు. పదేపదే హగ్గులు క్లోజ్ గా మూవ్ అవ్వడాన్ని తప్పుబడుతున్నారు. ఫ్రెండ్షిప్ అయితే ...విష్ణు ప్రియను ఎందుకు అన్ని మాటలు అన్నావ్..నువ్వు మాత్రం మగవాళ్లను ఎందుకు అంత మీద పడి మాట్లాడుతున్నావ్ అంటున్నారు.


తాజాగా సోనియాపై జరుగుతోన్న ట్రోలింగ్ పై ఆమె తల్లిదండ్రులు స్పందిచారు. తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన మల్లీశ్వరి- చక్రపాణి తమ కూతురిని బద్నాం చేయవద్దని వేడుకున్నారు.’బిగ్ బాస్ లో మా అమ్మాయి బాగా ఆడుతోంది. అయినా కొందరు తననే టార్గెట్‌ చేస్తున్నారు. మా అమ్మాయిని ఎందుకలా బద్నాం చేస్తున్నారో అర్థం కావట్లేదు. తను ఎంతో మందికి సాయం చేసింది. ఎన్నో వేల కుటుంబాలకు కోవిడ్ టైంలో తనకు తెలిసిన సాయం చేసి ఆదుకుంది. ఈ ట్రోలింగ్ చూస్తుంటే బిగ్ బాస్ లో తన సంపాదించుకున్న పేరు పోతుందనిపిస్తుంది.

newsline-whatsapp-channel
Tags : trolling socialmedia bigboss8 aakula-sonia

Related Articles