Srija:శ్రీజ అలాంటిదంటూ శిరీష్ భరద్వాజ్  తల్లి ఎమోషనల్.!

శిరీష్ భరద్వాజ్  ఈయన పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది చిరంజీవి ఫ్యామిలీ. చిరంజీవి కూతురు శ్రీజ శిరీష్ భరద్వాజ్ ను లవ్ చేసి  పెద్దల్ని  కాదని మ్యారేజ్ చేసుకుంది. ఒక కూతురు పుట్టిన తర్వాత వీరిద్దరి మధ్య ఏమైందో ఏమో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక అప్పటినుంచి శ్రీజ తన కూతురు నివృతిని తీసుకొని  తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇక అప్పటినుంచి శిరీష్ భరద్వాజ్ ఒంటరివాడయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయన మరో పెళ్లి చేసుకున్నాడు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-13/1720881488_bharat.jpg

న్యూస్ లైన్ డెస్క్: శిరీష్ భరద్వాజ్  ఈయన పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది చిరంజీవి ఫ్యామిలీ. చిరంజీవి కూతురు శ్రీజ శిరీష్ భరద్వాజ్ ను లవ్ చేసి  పెద్దల్ని  కాదని మ్యారేజ్ చేసుకుంది. ఒక కూతురు పుట్టిన తర్వాత వీరిద్దరి మధ్య ఏమైందో ఏమో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక అప్పటినుంచి శ్రీజ తన కూతురు నివృతిని తీసుకొని  తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇక అప్పటినుంచి శిరీష్ భరద్వాజ్ ఒంటరివాడయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయన మరో పెళ్లి చేసుకున్నాడు.

అయితే రీసెంట్ గానే శిరీష్ భరద్వాజ్  అనారోగ్య సమస్యల వల్ల కన్నుమూశారు. శిరీష్ భరద్వాజ్ మంచి విద్యావంతుడు. ఈయన చదువుకునే రోజుల్లోనే శ్రీజ తో లవ్ లో పడ్డారు. ఇద్దరు కలిసి పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకున్నారు. అంతే కాదు వీరు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీరికి రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇదే సమయంలో చిరు తమ్ముడు  పవన్ కళ్యాణ్ కూడా తన లైసెన్స్ గన్నుని తీసుకెళ్లి పోలీసులకు సరండర్ చేయాల్సి వచ్చింది.  

కట్ చేస్తే శిరీష్ భరద్వాజ్ శ్రీజల పెళ్లి మీడియాలో సంచలనం సృష్టించింది. కొన్నాళ్లపాటు కాపురం చేసిన తర్వాత వీరి మధ్య విభేదాలు రావడంతో చివరికి శ్రీజానే శిరీష్ పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దీంతో భరద్వాజ్ కొన్నాళ్లపాటు పోలీసులకు దొరకకుండా తిరిగి చివరికి ఆయనే వెళ్లి పోలీసుల ముందర లొంగిపోయారు. అలా చివరికి వీరిద్దరి మధ్య విడాకులు కూడా మంజూరు అయిపోయాయి.

ఇక ఎవరి దారి వారు చూసుకున్న తర్వాత ఈ మధ్యకాలంలోనే శిరీష్ మరణించారు. అయితే ఆయన మరణం తర్వాత శిరీష్ తల్లి మీడియాతో మాట్లాడుతూ పలు సంచలనమైన విషయాలు బయట పెట్టింది. భరద్వాజ్ కు శ్రీజ మరియు నివృతి అంటే చాలా ఇష్టమని తెలియజేసింది. తాను చనిపోయే చివరి క్షణాల్లో తన బిడ్డను చూడాలని ఎంతో కోరుకున్నాడని  ఈ విషయం తెలిసిన చిరంజీవి ఫ్యామిలీ కనీసం పట్టించుకోలేదని అన్నది. నివృతి నా కొడుకు సంతానమని తెలియజేసింది. కానీ వారి ప్రేమను చిరంజీవి ఫ్యామిలీ అర్థం చేసుకోలేదని చెప్పి శిరీష్ తల్లి ఎమోషనల్ అయింది

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu pawan-kalyan shirish-bharadwaj srija

Related Articles