విశాఖలో బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. దసరా నవరాత్రుల ఉత్సవాల సంధర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
విశాఖలో బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతి రోజూ పుష్ప అలంకరణలో అమ్మవారు భక్తులకు కనుల పండుగ చేస్తున్నారు. ఈ రోజు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన కలువపూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నవరాత్రులు తొమ్మిది రోజులు చాలా రకాల పూలతో పూజలు చేస్తున్నారు. ప్రతి రోజూ వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. జగన్మాతకు ఇష్టమైన కలువ పూలతో అమ్మవారికి ఇష్టమైన కుంకుమార్చన, సుగంధ పూలార్చన జరిపించారు. నిత్యఅన్నదానం తో పాటు ..కర్పూర నైవేద్యాలతో దీప ధూపాలతో అమ్మవారిని అర్చించారు.