India vs Srilanka: హాఫ్ సెంచరీతో చెలరేగిన ఫెర్నాండో.. భారత్ లక్ష్యం ఎంతంటే

భారత్, శ్రీలంక జట్లు మధ్య బుధవారం ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో లంక జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.


Published Aug 07, 2024 06:01:04 PM
postImages/2024-08-07/1723033864_sco2.PNG

న్యూస్ లైన్ స్పోర్ట్స్: భారత్, శ్రీలంక జట్లు మధ్య బుధవారం ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో లంక జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.  అవిష్క ఫెర్నాండో(96), కుసల్ మెండిస్(59) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. పాతుమ్ నిస్సాంక(45) పరుగులతో రాణించాడు. దీంతో శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో ఇద్దరూ దూకుడు బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. లంక స్కోర్ బోర్డుకు 90 పరుగులు జతచేశారు. అయితే ఈ జోడిని అక్షర్ పటేల్ బ్రేక్ చేశాడు. అవిష్క ఫెర్నాండో(45)ను ఒక చక్కని బంతితో బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కుసల్ మెండిస్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. వీళ్లిందరూ కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఇక మరో ఎండ్‌లో ఫెర్నాండో తుఫాన్ బ్యాటింగ్ చేశాడు. బౌండరీలు, సిక్సర్లు కొడుతూ (102 బంతుల్లో 96 పరుగులు 9 ఫోర్లు, 2 సిక్సర్ల)తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఫెర్నాండో(96), రియాన్ పరాగ్ బౌలింగ్‌లో భారీ ష్టార్ట్ ఆడే ప్రయత్నంలో బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సదీర సమరవిక్రమ(0), చరిత్ అసలంక(10), జనిత్ లియానాగే(8) వరుసగా విఫలమైయ్యారు. దీంతో ఐదు వికెట్లు కోల్పోయి 180 రన్స్ కొట్టింది. ఓవైపు వికెట్లు పడుతున్న భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ కుసల్ మెండిస్ ధనాధన బ్యాటింగ్ చేశాడు. దీంతో కుసల్( 82 బంతుల్లో 59 రన్స్ 4 ఫోర్ల)తో ఫిఫ్టి పూర్తి చేసుకున్నాడు. మరో బ్యాటర్  కమిందు మెండిస్(23 నటౌట్) కూడా మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. దీంతో శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. భారత బౌలర్లు రియాన్ పరాగ్ మూడు వికెట్లు పడగొట్టాగా.. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ తలా వికెట్ల తీశారు. 
 

newsline-whatsapp-channel
Tags : odi-match india virat-kohli cricket-news srilanka rohit-sharma

Related Articles