అదే మంటల్లో అతను కూడా చిక్కుకొని ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.ఈ సంఘటన తమిళనాడులోని తిరువెరుమూర్లో జరిగిందీ ఘటన.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏదైనా అతి పనికి రాదని అందుకే అంటారు. మనం ఏంటి ఈ మాత్రానికే చంపేశాడా అనుకుంటాం కాని ..భరించలేక చేశాడేమో...ఏదైనా తప్పు తప్పే లెండి. కాని కోపం లో ఓ వ్యక్తి తన భార్యను నిర్ధాక్షణ్యంగా పెట్రోల్ పోసి తగులబెట్టేశాడు. అదే మంటల్లో అతను కూడా చిక్కుకొని ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.ఈ సంఘటన తమిళనాడులోని తిరువెరుమూర్లో జరిగిందీ ఘటన.
రాజేంద్రప్రసాద్ (56), అనే వ్యక్తి ..తన భార్య హేమబిందు (50) భార్యాభర్తలు ఉన్నారు. హేమబిందు కు చాలా ఎక్కువ భక్తి. రోజులో ఎక్కువ శాతం పూజలు చేస్తూ ఇంట్లో వాళ్లకి ఇబ్బంది కలిగిస్తుండేదట. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో బిందు ప్రార్ధనలు ప్రారంభించారు. ఈ సమయంలో భర్త రాజేంద్రప్రసాద్ ..ఈ టైంలో పూజలేంటని అడగగా...ఇద్దరి మధ్య చాలా ఎక్కువ గొడవ జరిగింది. గొడవ పెరగడంతో కోపం పట్టలేని ప్రసాద్ బైక్ కోసం సీసాలో తెచ్చిపెట్టుకున్న పెట్రోలును ఆమెపై పోశాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న పూజా దీపం ఆమెకు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ప్రసాద్, బిందు ఇద్దరూ మంటల్లో చిక్కుకుపోయారు. అప్రమత్తమైన కుమారులు గుణశేఖర్, గురుస్వామి వారిని రక్షించే క్రమంలో వారు కూడా గాయపడ్డారు. నలుగురు ప్రస్తుతం తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.