DSC Results : ముగిసిన డీఎస్సీ పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడంటే

ఎస్సీ పరీక్షలు ముగియనుండటంతో విద్యాశాఖ ఫలితాల మీద  దృష్టి పెట్టింది. వారం రోజుల్లో కీ పేపర్ విడుదల చేసి..  తర్వాత ఫైనల్ కీ, ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తోంది.


Published Aug 05, 2024 04:51:10 PM
postImages/2024-08-05/1722856870_dscresults.jpg

న్యూస్ లైన్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ 2024 రాత పరీక్షలు నేటితో ముగిశాయి. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి ఆన్ లైన్ ద్వారా డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 2 లక్షల 79వేల 966 మంది అభ్యర్థులు టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి.

డీఎస్సీ పరీక్షలు ముగియనుండటంతో విద్యాశాఖ ఫలితాల మీద  దృష్టి పెట్టింది. వారం రోజుల్లో కీ పేపర్ విడుదల చేసి..  తర్వాత ఫైనల్ కీ, ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫలితాల అనంతరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎంపికైన టీచర్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనుంది. దీనికి సంబంధించి త్వరలోనే విద్యాశాఖ అదికారిక ప్రకటన చేయనుంది.

newsline-whatsapp-channel
Tags : india-people ts-news dsc latest-news telugu-news

Related Articles