ర్ల అమ్మకాలు భారీగా పెరగడంతో రాష్ట్రంలో బీర్ల ధరలు పెంచేందుకు ఆబ్కారీ శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే సర్కార్ బీర్ల తయారీ కేంద్రాల( బ్రూవరీ)కు చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 12 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది.
న్యూస్ లైన్ డెస్క్ : మందుబాబులకు రేవంత్ సర్కార్ షాక్ ఇవ్వనుంది. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్నలిక్కర్ అమ్మకాల మీద ఆదాయాన్ని మరింత పెంచుకునే అవకాశాన్ని సర్కార్ దండిగా వాడుకునేందుకు సిద్ధమైంది. బీర్ల అమ్మకాలు భారీగా పెరగడంతో రాష్ట్రంలో బీర్ల ధరలు పెంచేందుకు ఆబ్కారీ శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే సర్కార్ బీర్ల తయారీ కేంద్రాల( బ్రూవరీ)కు చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 12 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ భారమంతా మందుబాబుల మీదనే పడనుంది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆరు బ్రూవరీలు అంటే.. బీరు తయారీ కేంద్రాల్లో ఏడాదికి 68 కోట్ల లీటర్ల బీరు తయారవుతోంది. ఈ బీరును రాష్ట్ర సర్కార్ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా కొనుగోలు చేసి మద్యం దుకాణాలకు సప్లై చేస్తది. 12 బీర్లకు.. అంటే కాటన్ బీర్లను బేవరేజెస్ కార్పోరేషన్ కేవలం రూ.289 చెల్లిస్తోంది. మిగతా పన్నులన్నీ కలిపి రూ.1400 చొప్పున వైన్ షాపులకు అమ్ముతోంది. అంటే.. బ్రూవరీల దగ్గర ఒక బీరును రూ.24.8కి కొని.. దాన్ని రూ.116.66 కి అమ్ముతోంది. వైన్ షాపులో అదే బీరు రూ.150 గా.. స్ట్రాంగ్ బీరు అయితే రూ.160కి అమ్ముతున్నారు. తాజాగా రాష్ట్రంలో బీర్ల డిమాండ్ పెరగడంతో బ్రూవరీలు బీర్ల ఉత్పత్తి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బ్రూవరీలతో కుదుర్చుకున్న ఒప్పందం రెండేళ్ల పాటు అమలులో ఉంది. గడువు పూర్తయిన తర్వాత ధరలు సవరించి మరో రెండేళ్ల ఒప్పందాన్ని కొనసాగిస్తారు. అంటే.. ప్రతిరెండేళ్లకు ప్రభుత్వం బ్రూవరీలకు చెల్లించే ధరను దాదాపు 10 శాతం పెంచుతోంది. చివరిసారిగా గత ప్రభుత్వం 2022 మే నెలలో 6 శాతం చొప్పున రెండుసార్లు పెంచింది. నిర్వహణ ఖర్చులు పెరగడంతో ప్రస్తుత ప్రభుత్వాన్ని బ్రూవరీలు 20 నుంచి 25 శాతం పెంచేందుకు ప్రతిపాదనలు చేశాయి. ప్రభుత్వం సైతం బ్రూవరీల ప్రతిపాదనలకు ఓకే చెప్పేందుకే సిద్ధపడుతోంది. ఒకవేళ ధరలు పెరిగితే గనక.. కింగ్ ఫిషర్ లైట్ బీరు రూ. 170 నుంచి రూ.180 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. స్ట్రాంగ్ బీర్ అయితే.. రూ.190 నుంచి 200 వరకు పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కేఎఫ్ లైట్ బీర్ ధర రూ.150గా, స్ట్రాంగ్ బీర్ ధర రూ.160గా ఉంది. అంటే.. ఒక్కో బీరుపైన రూ20 నుంచి రూ.30 వరకు పెరిగే ఛాన్స్ ఉంది.