కొత్త రేషన్ కార్డుల అందరు ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అర్హత ఉండటంతో అవి లేకపోవడం వల్ల నిరుపేద కుటుంబాలకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొత్త రేషన్ కార్డుల అందరు ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌గా.. మంత్రులు దామోదర రాజానర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సభ్యులుగా నియమిస్తూ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం పరిశీలన జరిపి విధి విధానాలను కమిటీ సిఫారసు చేయనుంది.