కల్కి 2898AD... ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదలైన కల్కి మూవీ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు.ఈ సినిమా విడుదలై నెల దాటినా కూడా ఇంకా కలెక్షన్ల హవా తగ్గడం లేదు. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్
న్యూస్ లైన్ డెస్క్: కల్కి 2898AD... ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదలైన కల్కి మూవీ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు.ఈ సినిమా విడుదలై నెల దాటినా కూడా ఇంకా కలెక్షన్ల హవా తగ్గడం లేదు. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా ఇంకా థియేటర్లలో నుండి పోవడం లేదు. అయితే అలాంటి ఈ సినిమాలో హైలెట్ అయిన పాత్రల్లో విలన్ పాత్రలో నటించిన సుప్రీమ్ యాస్కిన్ కూడా ఒకరు..
అయితే సుప్రీమ్ యాస్కిన్ పాత్ర పార్ట్ -1లో చాలా తక్కువగా ఉంది. కానీ ఇందులో విలన్ ని మాత్రం చాలా భయానకంగా చూపించారు.ఇక కల్కి 2898 పార్ట్ 2 లోనే విలన్ స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటున్నట్టు తెలుస్తోంది.అయితే విలన్ పాత్రలో నటించిన కమల్ హాసన్ కనిపించింది తక్కువ సమయమే అయినప్పటికీ 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అయితే మొదట్లో ఈ సినిమాకి కమల్ హాసన్ నో చెప్పారట.
ఎందుకంటే అప్పటికే ఆయన భారతీయుడు 2 సినిమాలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాలో నటించడానికి చూద్దాంలే అంటూ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్షన్ లో పెట్టారట. దాంతో ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా కమల్ హాసన్ ని విలన్ పాత్రలో వద్దనుకొని మరో హీరోని పెట్టుకుందామనుకున్నారట. ఇక ఆ హీరో ఎవరో కాదు మలయాళ స్టార్ మోహన్ లాల్.. సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో మోహన్ లాల్ ని తీసుకుందామని నాగ్ అశ్విన్ నిర్ణయం తీసుకొని తెల్లవారితే ఈ కథ మోహన్ లాల్ కి చెబుదాం
అనుకునే సమయంలో కమల్ హాసన ఫోన్ చేసి నేను ఈ పాత్రలో నటిస్తాను అని ఓకే చెప్పారట. ఇక కమల్ హాసన్ ఓకే చెప్పడంతో ఆయన్ని సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో నాగ్ అశ్విన్ ని చూపించారు. ఒకవేళ కమల్ హాసన్ గనుక నో చెబితే కచ్చితంగా విలన్ పాత్ర మోహన్ లాల్ కి వచ్చేది.కానీ కొద్దిలో బ్లాక్ బస్టర్ మూవీలో అవకాశాన్ని పోగొట్టుకున్నారు మోహన్ లాల్