Peacock: ఏకంగా నెమలి కర్రీ రెసిపీనే పోస్ట్ చేశాడు.. తర్వాత ఏమైందంటే..?

కూర ఎలా తయారు చేయాలో చెప్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. వీడియో ఒక్కటే ఏమో కానీ, నెమలి కూరను వండుతూ యూట్యూబ్‌లో రెసిపీని పోస్ట్ చేశాడు. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 


Published Aug 11, 2024 11:46:49 AM
postImages/2024-08-11/1723357009_peacock.jpg

న్యూస్ లైన్ డెస్క్: సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని, లైక్స్ రావాలని, పాపులర్ అయిపోవాలని కొందరు తెగ ఆరాటపడుతుంటారు. ఇప్పటివరకు యువత మాత్రమే ఇలా ఉంది అనుకుంటే.. పెద్ద వాళ్లు కూడా అలానే చేస్తున్నారు. ఏం చేసినా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటుగా మారింది. యూట్యూబ్ వ్లాగ్స్ పేరుతో ఇష్టం వచ్చినట్లు వీడియోలు చేసి అన్నిటినీ పోస్ట్ చేస్తున్నారు. అయితే, ఇలాంటి వీడియోలను పోస్ట్ చేసి ఓ వ్యక్తి ప్రస్తుతం జీవితాన్ని నాశనం చేసుకునే వరకు వెళ్లాడు. 

అజ్ఞానమో, అతితెలివో తెలియదు కానీ, ఓ వ్యక్తి ఏకంగా నెమలి కూర ఎలా తయారు చేయాలో చెప్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. వీడియో ఒక్కటే ఏమో కానీ, నెమలి కూరను వండుతూ యూట్యూబ్‌లో రెసిపీని పోస్ట్ చేశాడు. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 దీంతో అతనిపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. అయితే, వన్యప్రాణుల రక్షణ చట్టం కింద నెమళ్లకు రక్షణ కల్పించారు. నెమలిని చంపడం పెద్ద నేరం. నెమలి కూర చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేసినందుకు అతను జైలుకు వెళ్లే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu telanganam viral-news youtube

Related Articles