నిన్న 6 ఉదయం 6 గంటల సమయానికి తులం ధర రూ.89,720 ఉండగా, ప్రస్తుతం ఇదే సమయానికి రూ.90,450 వద్ద ఉంది. ఇది భారీగా పెరిగినట్టే .
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బంగారం ధర పెరగడమే కాని తగ్గడం కనపడం లేదు. 1000 పెరుగుతుంది 10 తగ్గుతుంది. చాలా మంది బంగారం ధరలు 38 శాతం వరకు తగ్గుతాయని అంచనాలు వేస్తున్నా బంగారం తగ్గుముఖం పట్టడం మాత్రం కనిపించడం లేదు. బంగారం ధరలు 10 గ్రాములకు రూ.55,000 వరకు తగ్గుతాయని భావిస్తున్నారు. 2025లో ఇప్పటివరకు బంగారం దాదాపు 20 శాతం పెరిగింది.
ఈ రోజు బంగారం తులం పై ఏకంగా రూ.700కుపైగా పెరిగింది. నిన్న 6 ఉదయం 6 గంటల సమయానికి తులం ధర రూ.89,720 ఉండగా, ప్రస్తుతం ఇదే సమయానికి రూ.90,450 వద్ద ఉంది. ఇది భారీగా పెరిగినట్టే .
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.83,060 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.90,600 వద్ద కొనసాగుతోంది. అన్ని ప్రధాన నగరాల్లోను ఇదే ధర నడుస్తుంది. అయితే వెండి కిలో ధర రూ. 92,900 గా ఉంది. నిన్న ఇదే సమయానికి వెండి ధర రూ. 93,900 గా ఉంది. అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మార్నింగ్ స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్ బంగారం ధరలు 38 శాతం తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.