ప్రస్తుత కాలంలో ఆడ మగ అనే తేడా లేకుండా ఫైల్స్ సమస్య అనేది చాలా మందిని బాధిస్తోంది. దీని నుంచి బయటపడడానికి ఎన్నో రకాల మందులు, ఆస్పత్రిలో తిరిగినా కానీ ఈ సమస్య అనేది
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో ఆడ మగ అనే తేడా లేకుండా ఫైల్స్ సమస్య అనేది చాలా మందిని బాధిస్తోంది. దీని నుంచి బయటపడడానికి ఎన్నో రకాల మందులు, ఆస్పత్రిలో తిరిగినా కానీ ఈ సమస్య అనేది మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుందట. ఇలాంటి ఫైల్స్ సమస్య రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి లోపల ఉండే ఫైల్స్ మరొకటి బయటకు వచ్చే ఫైల్స్. ఈ సమస్య సాధారణంగా కనిపించినా కానీ దాని నుంచి వచ్చే నొప్పి మాత్రం వర్ణనాతీతం. ఏదో ముళ్ళపై కూర్చున్నట్టు ఉంటుందట.
మలమూత్ర సమయంలో ఆ బాధను చెప్పుకోలేమని ఫైల్స్ సమస్య ఉన్నవారు అంటుంటారు. పూర్తిగా రక్తంతో కూడినటువంటి మలం, అంతేకాకుండా పూర్తిగా మలవిసర్జన రాకపోవడం, ఈ సమస్య వల్ల ఆహార, జీవన శైలిలో కూడా అనేక మార్పులు వస్తాయట. మనిషి ఎక్కడ కూడా కుదురుగా కూర్చోలేడు, కుదురుగా నిలబడడం కష్టమట. ఈ సమస్య ఎక్కువగా డ్రైవింగ్ చేసే వారిలో ఉంటుంది. అలాంటి ఈ ఫైల్స్ సమస్యను ఆయుర్వేద వైద్యం ద్వారా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చట. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల పసుపు, మరో 50 గ్రాములు ఎండు ద్రాక్ష తీసుకోవాలి. జీలకర్రను దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు జీలకర్ర ఎండు ద్రాక్ష మొత్తం తీసుకొని కాస్త తేనె కలిపి దాన్ని ఒక పేస్టులా తయారు చేయాలి. ఆ పేస్టును చిన్న మాత్రలవలే తయారు చేసుకుని రోజు ఉదయం పూట పరిగడుపున ఒకటి నోట్లో వేసుకోవాలి. ఆ తర్వాత కాసేపటికి ఒక గ్లాస్ మంచినీటిని తాగాలి. దీనివల్ల ఫైల్స్ నుంచి చాలా వరకు ఉపశమనం కలుగుతుందట.
అంతేకాకుండా మరో 25 గ్రాముల తేనె మైనంను వేడి చేసి, 100Ml ఆముదం, మరో 20 గ్రాముల కర్పూరం వేడి చేసి డబ్బాలో నిలువ చేసుకొని ఫైల్స్ ఉన్న ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని ఉదయం, రాత్రి క్రమం తప్పకుండా రాసుకోవాలట. ఇలా చేయడం వల్ల ఒక వారం రోజుల్లో మీకున్న ఫైల్స్ సమస్య ఎంతటిదైనా సరే ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద నీపుణులు అంటున్నారు.