Urfi Javed: సైలెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ !

ఈ రోజు నుంచే డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. అంటే వీడియోలో కనిపిస్తున్న నిశ్చితార్ధం ఆ షో ఎపిసోడ్ అని అర్ధం.


Published Feb 14, 2025 09:13:00 PM
postImages/2025-02-14/1739547871_UorfiJavedEngaged2025026fa451db2dd44437a3fdf286e122aa844x3.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: సోషల్ మీడియా పుణ్యమా అని ఉర్ఫీ తెలియని వారు లేరు. ఫస్ట్ లో బోల్డ్ అండ్ క్రింజ్ ఫ్యాషన్ తో హల్ చల్ చేసినా తన పేరు అందరికి తెలిశాక ...మాత్రం భలే క్రేజీ డిజైన్స్ తో టాలెంటెడ్ అనేపేరు తెచ్చుకుంది. ఉర్ఫీ జావేద్ త్వరలో కొత్త OTT షో ద్వారా అభిమానులను పలకరించనుంది. దీని కోసమే ఇలా వినూత్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ, ఉర్ఫీ ‘ప్రేమించడం అంత సులభం కాదు, మోసం చేసే ప్రమాదం ఉందని అర్థం చేసుకోండి, మీరు దానిని ఆపాలి…’ అనే క్యాప్షన్‌లో చెప్పింది. ఈ షోలో ఉర్ఫీ ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ఈ రోజు నుంచే డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. అంటే వీడియోలో కనిపిస్తున్న నిశ్చితార్ధం ఆ షో ఎపిసోడ్ అని అర్ధం.


ఇక ఈ వీడియోలో ఉర్ఫీ వేలికి ఉంగరం తొడుగుతున్నది మరెవరో కాదు ప్రముఖ హాస్యనటుడు హర్ష్ గుజ్రాల్. ఉర్ఫీ మరియు హర్ష్ కలిసి ఈ షోను హోస్ట్ చేస్తున్నారు.ఉర్ఫీ అనేక సీరియల్స్‌లో కూడా నటించింది. ‘బడే భయ్యా కి దుల్హానియా’, ‘మేరీ దుర్గా’, ‘బేపనా’ మరియు ‘కసౌతి జిందగీ కే’ తదితర సీరియల్స్ లో ఈ బోల్డ్ బ్యూటీ నటించింది.  అంతేకాదు బిగ్ బాస్ బ్యూటీ కూడా .

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bollywood- engagement fashion-icon

Related Articles