లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరవడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు స్పందించారు. ఈ కేసులో కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారినట్టు వచ్చిన ఆరోపణల్లో నిజమెంత? అబద్ధమెంత? అనేది తేలుతుందన్నారు.
న్యూస్ లైన్ డెస్క్ : లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరవడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు స్పందించారు. ఈ కేసులో కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారినట్టు వచ్చిన ఆరోపణల్లో నిజమెంత? అబద్ధమెంత? అనేది తేలుతుందన్నారు. ఈడీ, సీబీఐలను అడ్డు పెట్టుకొని బీజేపీ ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసిందా? లేక నిజంగానే కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారాయా? అనే నిజం బయట పడుతుందని వీహెచ్ కామెంట్ చేశారు.
కాగా.. 166 రోజుల పాటు లిక్కర్ పాలసీ కేసులో తిహార్ జైలులో శిక్ష అనుభవించిన కవితకు ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవితను కస్టడీలో ఉంచడం వెనుక కారణాలేంటనే విషయమై ఈడీని, సీబీఐని సుప్రీంకోర్టు వరుస ప్రశ్నలు వేసింది. కవితపై ఉన్నవి ఆరోపణలు మాత్రమే అని.. ఆధారాలు కావని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది.