ఈ పిక్ కు లైఫ్ చాలా అందమైన పాత్ర పోషించబోతున్నామంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ మెగా ఫ్యామిలీ క్యూట్ కపుల్ వరుణ్ తేజ్ , నటి లావణ్య త్రిపాఠి దంపతులు తమ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో తాము పేరెంట్స్ కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. గత కొంత కాలంగా లావణ్య ప్రెగ్నెంట్ అని వస్తున్న వార్తలకు ఇన్ స్టా పోస్ట్ ద్వారా చెక్ పెట్టేశారు. తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలలో ఓ స్పెషల్ పిక్ ను పోస్ట్ చేశారు. ఆ పిక్ లో చిన్నారి షూస్ తో పాటు వరుణ్య, లావణ్య ఒకరి చేతిని ఒకరు పట్టుకొని కనిపించారు. ఈ పిక్ కు లైఫ్ చాలా అందమైన పాత్ర పోషించబోతున్నామంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది.
ఇటలీలో వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట, తమ ప్రేమ బంధాన్ని తర్వాతి దశకు తీసుకువెళ్తున్నట్లు ఈ ప్రకటన ద్వారా తెలిపారు. సోషల్ మీడియా వేదికగా వరుణ్, లావణ్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వరుణ్ పెల్లి తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నా...పెద్దగా హిట్టు పడడం లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.