INDIA: అప్పుడు బాలకోట్ ..ఇప్పుడు సిందూర్ భారత్ మాస్టర్ ప్లాన్ !

మన దేశంలో ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి సడన్ గా పాకిస్థాన్ ను చావు దెబ్బ తీశారు.


Published May 07, 2025 01:23:00 PM
postImages/2025-05-07/1746604625_operationsindoor07445789116x90.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలను ప్రారంభించింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేపట్టింది. ఈ చర్యపై యావత్ భారత్ హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తుంది.   దాయాదిని ఏ మార్చి ..అత్యంత పకడ్భందీగా భారత్ ప్రజలను యావత్ ప్రపంచాన్ని మాక్ డ్రిల్స్ వైపు మల్లించి అటు పాకిస్థాన్ లో వంద మంది ఉగ్రవాదులను మట్టికరిపించింది భారత్ . పాకిస్థాన్ రిలీజ్ చేసిన ఓ వీడియోలో ఉగ్రవాదులు పరుగులు తియ్యడం ఇప్పుడు వైరల్ అవుతుంది. పహల్గామ్ ఉగ్రదాడుల బాధితులు తమకు న్యాయం జరిగిందంటున్నారు. 


బాలకోట్ దాడులకు ముందు కూడా ఇలాంటి వ్యూహాలతోనే ప్రధాని అమలు చేశారు. దాడులకు ముందు మన దేశంలో ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి సడన్ గా పాకిస్థాన్ ను చావు దెబ్బ తీశారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్ పై భారత్ దాడులకు పాల్పడింది. ఆ దాడికి 48 గంటల ముందు ప్రధాని మోదీ ఎప్పటివలే ఎంతో ప్రశాంతంగా తన పనులు చేసుకున్నారు. ఎవరికి అనుమానం కూడా రాకుండా జాగ్రత్త పడ్డారు.  ఫిబ్రవరి 25న ఆయన ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికి అంకితం చేశారు. భారత సాయుధ దళాల పరాక్రమం గురించి మాట్లాడినప్పటికీ పాక్ లోని ఖైబర్ ఫంఖ్తుంఖ్వాలోని ఉగ్రస్ధావారలపై జరగబోయే దాడుల గురించి మాత్రం ఎలాంటి సూచనలు చేయలేదు. అదే రోజు రాత్రి 9 గంటలకు భారత వాయుసేన దాడులకు సిధ్ధమవుతుండగా ప్రధాని మోడీ ఢిల్లీలోని ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.


అభివ్రుద్ధి, భారత ఆకాంక్షలు ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడంలో భారత సంకల్పం గురించి ఆయన మాట్లాడారు. అప్పుడు కూడా మోదీ ఫేస్ లో ఎలాంటి టెన్షన్ కాని కంగారు కాని లేదు. ప్రశాంతంగా ఉన్నారు. భారత్ బలగాలపై తనకు అంత నమ్మకం. ఇప్పుడు కూడా ఆపరేషన్ సిందూర్ టైంకి కూడా అంతే. యావత్ భారత్ ను మాక్ డ్రిల్స్ పేరుతో డైవర్ట్ చేశారు. అంతా దీని కోసం వెయిట్ చేస్తుంటే ...భారత్ మాత్రం పాక్ ను చావు దెబ్బకొట్టివచ్చింది. అయితే బాలకోట్ లాగా ఇప్పుడు కూడా మంగళవారం రాత్రి ఏబీపీ నెట్ వర్క్ నిర్వహించిన ఇండియా ఎట్ 2047 సదస్సులో మోదీ మాట్లాడారు. భారత జలాలను ఇక నుంచి దేశం దాటనివ్వబోమని మోదీ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసమే వాటిని వినియోగిస్తామని తేల్చి చెప్పారు. దాదాపు అరగంట సేపు మాట్లాడినా మోదీ మాటల్లో దాడులు గురించి కాని సింధూర్ గురించి కాని అసలు బయటపెట్టలేదు. ఏది ఏమైనా మోదీ మాస్టర్ ప్లాన్ మరోసారి గెలిచింది. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu india operation pakistan indian-army

Related Articles