బుధవారం తెల్లవారుజామున 1:05 గంటల నుంచి 1:30 గంటల వరకు 25 నిమిషాల పాటు ఆపరేషన్ జరగ్గా, 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడానికి 24 క్షిపణులను భారత్ ప్రయోగించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ ..దెబ్బకు దెబ్బ తీసింది. అయితే ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ లో ఉన్న ఉగ్రదాడులు జస్ట్ 25 నిమిషాల్లో 24 క్షిపణులతో దాడులు చేసి ఉగ్రవాద మూక నోరు మూయించింది భారత్ . అసలు 25 నిమిషాల్లో అటాక్ ఎలా కంప్లీట్ చేసిందంటే ...బుధవారం తెల్లవారుజామున 1:05 గంటల నుంచి 1:30 గంటల వరకు 25 నిమిషాల పాటు ఆపరేషన్ జరగ్గా, 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడానికి 24 క్షిపణులను భారత్ ప్రయోగించింది. ఈ ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీ , నౌకాదళం , వాయుసేన సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి.
ఉగ్రస్థావరాలపై ఎటాక్ కోసం భూమి నుంచి , గాలి నుంచి ప్రయోగించే క్షిపణులతో పాటు లేజర్ నిర్దేశిత క్షిపణులు , ఉపగ్రహ గైడెడ్ గ్లైడ్ బాంబులను భారత్ యూజ్ చేసింది. నిఘా డ్రోన్స్ కూడా రియల్ టైమ్ పర్యవేక్షణలో అతి తక్కువ ప్రాణనష్టం ఉగ్రవాద స్థావరాలను ఖచ్చితంగా భారత్ ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్ లో పదుల సంఖ్యలో పాక్ ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తుంది. ఇంత పెద్ద దాడి జరిగినా పాకిస్థాన్ మరణాల సంఖ్య తక్కువగా చూపించే ప్రయత్నం చూపిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి ముందు భారత త్రివిధ దళాలు పెద్ద కసరత్తే చేశాయి. తొలుత పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లోని ప్రధాన ఉగ్రవాద స్థావరాల లొకేషన్లను చాలా పక్బందిగా గుర్తించాయి. ఇందుకోసం భారత నిఘా వర్గాలు అందించిన సమాచారాన్ని చాలా జాగ్రత్తగా వాడుకున్నాయి. పాక్, పీఓకేలోని ముజఫరాబాద్, కోట్లి, బహవల్‌పూర్, రావల్ కోట్, చాక్‌స్వరి, భీంబేర్, నీలం వ్యాలీ, జీలం, చాక్వల్‌లలో ఉన్న నిర్దిష్ట ఉగ్రవాద స్థావరాలను టార్గెట్‌లుగా భారత్ ఎంచుకుంది. పాకిస్థాన్ ప్రేరిపిత ఉగ్రవాద సంస్థలు లష్కరే తైబా , జైషే మహ్మద్ గతంలో భారత్ లో ఎన్నో ఉగ్రదాడులు జరిగాయి. అయితే వాటిలో ఈ రెండు ఉగ్ర సంస్థలకు నిలయాలుగా, స్థావరాలుగా మారిన 9 నిర్దిష్ట ప్రాంతాలనే తమ లక్ష్యంగా భారత త్రివిధ దళాలు ఎంచుకున్నాయి. వీటిలో నాలుగు ఉగ్రస్థావరాలు పాకిస్తాన్ లో ఉండగా ..మిగతా ఐదు ఉగ్రస్థావరాలు పీఓకే లో ఉన్నాయి. వీటిపై భారత్ దాడి చేసింది