రీసెంట్ హిట్ అయిన అమరన్ మూవీ హీరో శివకార్తికేయన్ ప్రశంసలు కురిపించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : " ఆపరేషన్ సిందూర్ " మరో సారి భారతీయులు గర్వపడే పనిచేశారు ఇండియన్ ఆర్మీ. చారిత్రాత్మక విజయం సాధించింది భారత్ . భారత్ విజయం పట్ల సినీ ప్రముఖులు చాలా సంతోషం గా ఉన్నారు. రీసెంట్ హిట్ అయిన అమరన్ మూవీ హీరో శివకార్తికేయన్ ప్రశంసలు కురిపించారు. తన సినిమాలో డైలాగ్ చెబుతూ ఇండియన్ ఆర్మీకి శుభాకాంక్షలు చెప్పారు.
"#ఆపరేషన్ సిందూర్ ఇదే భారత సైన్యం అసలు స్వరూపం! జై హింద్" అని పేర్కొన్నారు. దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ ఆధారంగా వచ్చిన " అమరన్ " మూవీలో శివకార్తీకేయన్ మేజర్ పాత్రను పోషించారు. ఆ సినిమాలో ఓ ఉగ్రవాద నాయకుడిని మట్టుబెట్టే ముందు, మేజర్ ముకుంద్ అతనితో "ఇదే భారత సైన్యం అసలు స్వరూపం" అని చెప్తారు ఆ డైలాగ్ ను పోస్ట్ చేసి ఇండియన్ ఆర్మీకి శుభాకాంక్షలు తెలిపారు.
ఆపరేషన్ సింధూర్ లో ఉగ్రవాదులు వినియోగిస్తున్న తొమ్మిది స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని భారత సైన్యం ప్రకటించింది. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఎలాంటి దాడులు చెయ్యలేదని , లక్ష్యాల ఎంపికలో దాడి అమలులో గణనీయమైన సంయమనం పాించమని సైన్యం వెల్లడించింది.