సినీ ప్రముఖుల వ్యక్తిగత అంశాలకు సంబంధించిన జ్యోతిష్యాన్ని చెప్పబోనని వేణుస్వామి స్పష్టం చేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సమంత నాగచైతన్య విడిపోతారని చెప్పి ...ఫేమ్ లోకి వచ్చాడు ఈ వేణుస్వామి. ఇక అక్కడ నుంచి ఈ ఏడాది ఇండస్ట్రీలో వాడు పోతాడు...వాళ్లతో సినిమాలు ఇలా తియ్యకూడదు..ఇదే సోది. ఏంటో అన్ని నెగిటివ్ మాటలే చెప్పెటోడు. పాజిటివ్ విషయాలు మాత్రం అస్సలు రావు సార్ కి.
రీసెంట్ గా నాగచైతన్య , శోభిత ఎంగేజ్ మెంట్ అయ్యాక ...ఇక వాళ్ల లైఫ్ కోసం చెప్పబడును అని పోస్ట్ వేశాడు. వీళ్ల లైఫ్ కూడా పెద్ద గా బాగోదు..కుజుడు కూర్చున్నాడు...శని నిల్చున్నాడంటు ఒకటే డబ్బాలు..ఇద్దరు మూడేళ్ల కంటే కలిసి ఉండరని చెప్పాడు. ఫ్యాన్స్ కి మండిందో లేకో ...ఇలాంటి అల్పులతో మాటలేల అని అక్కినేని వారు ఏమైనా కాకి తో కబురు పెట్టారో ..వేణుస్వామి వారు ఇక పై ఎవరి గురించి మాట్లాడను అంటూ స్టేట్మెంట్ వేశారు.
నా మాటకు ఇంకా నేను కట్టుబడే ఉన్నాను. అప్పుడు నాగచైతన్య- సమంత జ్యోతిష్యం చెప్పాను.దానికి పొడగింపుగా మొన్న నాగచైతన్య- శోభిత ల భవిష్యత్తు చెప్పాల్సి వచ్చింది. నేను సెలెబ్రెటీల జ్యోతిష్యం జోలికి పోను...మీరు కూడా నా నుంచి అది ఆశించొద్దు. వద్దు ఇక పై నన్ను ఎవ్వరు ఫోర్స్ చెయ్యొద్దు నేను జాతకం చెప్పనని చెప్పేశారు. ఇకపై రాజకీయాలకు సంబంధించి అంచనాలు, సినీ ప్రముఖుల వ్యక్తిగత అంశాలకు సంబంధించిన జ్యోతిష్యాన్ని చెప్పబోనని వేణుస్వామి స్పష్టం చేశారు.నెటిజన్లు మాత్రం ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారంటే నమ్మండి.