VD 12: విజయ్ దేవరకొండ VD 12 నుంచి ఎక్సైటింగ్ అప్డేట్ !


Published Oct 21, 2024 07:24:00 PM
postImages/2024-10-21/1729518920_maxresdefault.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: విజయ్ దేవరకొండ మరియు గౌతమ్ తిన్నసూరి  కాంభినేషన్ లో వస్తున్న VD12 సినిమా కు సంబంధించి క్రేజీ అప్ డేట్ రిలీజ్ అయ్యింది.  ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రగడ్ లుక్ ఆడియన్స్ ను థ్రిల్ చేసేసింది.  విజయ్, 'మళ్ళీరావా', 'జెర్సీ' చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు, జాతీయ అవార్డు విజేత గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది.


స్టంట్ డైరక్టర్ ఛేతన్ రష్మి డిసౌజా  మాట్లాడుతూ...ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ కేరళలో షూట్ చేసామని చెప్పారు. ఆ ఫైట్ సీక్వెన్స్ బ్రిలియెంట్ గా వచ్చిందని చెప్పుకొచ్చారు. వీడీ 12’ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఇటీవల దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్‌ కాగా.. నిర్మాణ సంస్థ స్పందించింది. 60 పర్సంట్ సినిమా షూట్ కంప్లీట్ అయ్యింది. మరి కొద్ది రోజుల్లో మీ ముందు మీ రౌడీ హీరో రాబోతున్నాడంటు సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది.


ఇందులో విజయ్‌ ఓ స్పై పాత్రలో కనిపించనున్నారు. మళ్లీ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండను పవర్‌ఫుల్‌గా చూడనున్నారని నిర్మాత ఓ సందర్భంలో అన్నారు. వచ్చే యేడాది 28 న ఈ సినిమా రిలీజ్ ఉండబోతున్నట్లు తెలిపారు మూవీ టీం.ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ‘విధి పిలిచింది.. రక్తపాతం ఎదురుచూస్తోంది.. కొత్త రాజు ఉద్భవిస్తాడు’ అంటూ టైటిల్ పోస్టర్‌తోనే ఆసక్తి పెంచిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.రీసెంట్ గా విజయ్ కేరళ ఫ్యాన్స్ తో చిన్న మీటింగ్ కూడా ఏర్పాటుచేసుకున్నాడు. సినిమా పై బజ్ ఉంది. మరి ఏమవుతుందో చూడాలి.
 

newsline-whatsapp-channel
Tags : vd14 movie-news vijay-deverakonda gautham-thinnanuri

Related Articles