Vijay: విజయ్ పార్టీ జెండా రివీల్.. ఎలా ఉందో చూశారా..?

పార్టీ జెండాను ఆవిష్కరించిన వేళ విజయ్ అభిమానులు, తమిళగ వెట్రి ఖగలం పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. మరోవైపు ట్విట్టర్‌లో #VTKflagday No.1 ట్రేండింగ్‌లో ఉంది. 


Published Aug 22, 2024 02:06:58 AM
postImages/2024-08-22/1724310379_vijaythalapati.jpg

న్యూస్ లైన్ డెస్క్: తమిళ హీరో, తమిళగ వెట్రి ఖగలం(TVK) పార్టీ అధినేత విజయ్ తలపతి తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. గురువారం చెన్నైలోని పార్టీ ఆఫీసులో జెండాతో పాటు పార్టీ గుర్తును ఆవిష్కరించారు. 

ఎరుపు, పసుపు రంగుల కలయికతో జెండా కనిపిస్తోంది. ఇందులో ఓ ఎరుపు రంగు వలయంలో కురివిప్పిన నెమలి ఉన్నట్లుగా తెలుస్తోంది. దానికి రెండు వైపులా రెండు ఏనుగులు కనిపిస్తున్నాయి. పార్టీ జెండాను ఆవిష్కరించిన వేళ విజయ్ అభిమానులు, తమిళగ వెట్రి ఖగలం పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. మరోవైపు ట్విట్టర్‌లో #VTKflagday No.1 ట్రేండింగ్‌లో ఉంది. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సామజిక న్యాయం, సమాన హక్కుల కోసం కృషి చేస్తానని విజయ్ అన్నారు. కులం, మతం, లింగం, జన్మస్థలం పేరుతో వ్యత్యాసాలను రూపుమాపడం, ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఆయన అన్నారు. 

newsline-whatsapp-channel
Tags : politics tvkflagday tvkflaglaunch- tamilagavettrikazhagam tvkflaghoisting vijaythalapathy

Related Articles