VINESH POGHAT: ప్రభుత్వ ఉద్యోగం అక్కర్లేదు...4 కోట్లే కావాలి !

రూ. 4కోట్ల నగదు బహుమతి, నివాస స్థలం లేదా గ్రూప్ ఎ ప్రభుత్వ ఉద్యోగం. ఈ మూడింటిలో వినేశ్‌ నగదు బహుమతిని ఎంపిక చేసుకున్నారు.


Published Apr 11, 2025 09:54:00 PM
postImages/2025-04-11/1744388802_vineshphogat.jpg.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే గా ఎన్నికైన ప్రముఖ మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ హరియాణా ప్రభుత్వం నుంచి రూ.4 కోట్ల నగదును బహుమతిగా పొందాలని అనుకుంటున్నారు. ఆమె ఒలంపిక్స్ లో 50 కిలోల రెజ్లింగ్ ఈ వెంట్ ఫైనల్ కు అర్హత సాధించి రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఫైనల్ కు ముందు దాదాపు 100 గ్రాములు ఎక్కవు బరువు ఉండడంతో అనర్హత వేటు పడింది. ఈ క్రమంలోనే హర్యాయాణా ప్రభుత్వం మూడు అవకాశాలు ఇచ్చింది. రూ. 4కోట్ల నగదు బహుమతి, నివాస స్థలం లేదా గ్రూప్ ఎ ప్రభుత్వ ఉద్యోగం. ఈ మూడింటిలో వినేశ్‌ నగదు బహుమతిని ఎంపిక చేసుకున్నారు.


అయితే ఒలంపిక్స్ నుంచి బయటకు వచ్చిన వినేశ్ తనకు రజత పతకం అయినా ఇవ్వాలని పోరాడింది. కాని నిబంధనలు మేరకు ఒలంపిక్స్ కమిటీ ఒప్పుకోలేదు. అయితే ఆ కోపంలో ఆమె రిటైర్మెంట్ ప్రకటించింది.  రాష్ట్ర మంత్రివర్గం వినేష్‌ను ఒలింపిక్ రజత పతక విజేతగానే గుర్తించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. క్రీడా విధానం కింద ఆమెకు అదే ప్రయోజనాలను అందించేందుకు అంగీకరించిందని ప్రకటించారు. వినేశ్ ప్రభుత్వానికి గుర్తు చేసింది , రీసెంట్ గా వినేశ్ రూ. 4 కోట్ల నగదు బహుమతి తీసుకుంటున్నట్లు తెలిపారు.
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu centralgovernment vinesh-phogat haryana

Related Articles