కోహ్లీని బీసీసీఐ మందలించినట్లు సమాచారం. కొన్ని సార్లు కోపపడినా ..వెంటనే రియాక్ట్ అయ్యి సారీ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ , లఖ్ నపూ బౌలర్ నవీన్ ఉల్ హక్ సహా పలువురితో ఐపీఎల్ లో గొడవలు పెట్టుకొని చాలా హాట్ టాపిక్ గా కూడా నిలిచాడు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టీమ్ ఇండియా దిగ్గజం విరాట్ కొహ్లీ తన బ్యాటింగ్ తోనే కాదు గొడవలతో కూడా బాగా ఫేమస్. టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ , లఖ్ నపూ బౌలర్ నవీన్ ఉల్ హక్ సహా పలువురితో ఐపీఎల్ లో గొడవలు పెట్టుకొని చాలా హాట్ టాపిక్ గా కూడా నిలిచాడు. పెర్త్‌లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు అప్పటి భారత్ టీమ్ కెప్టెన్ కోహ్లీ జర్నలిస్టును దుర్భాషలాడినట్లు వార్తలు వచ్చాయి. ఆఖరికి బీసీసీఐ కలగజేసుకుని గొడవను క్లియర్ చేశారు. మరోవైపు, భవిష్యత్తులో జర్నలిస్టుపై దుర్భాషలాడొద్దని కోహ్లీని బీసీసీఐ మందలించినట్లు సమాచారం. కొన్ని సార్లు కోపపడినా ..వెంటనే రియాక్ట్ అయ్యి సారీ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి.
2020లో న్యూజిలాండ్ పర్యటనకు భారత్ వెళ్లింది. అప్పుడు ఓ జర్నలిస్టు, మైదానంలో కోహ్లీ దూకుడు, ప్రవర్తనపై ఓ ప్రశ్న అడిగాడు.ఈ క్వశ్చన్ తో కొహ్లీ ఆ జర్నలిస్ట్ ను కొట్టినంత పని చేశాడు. విరాట్ కోహ్లీ, ఆసీస్ పేసర్ జాన్సన్ గొడవపడ్డాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత జాన్సన్ తో జరిగిన గొడవ గురించి కొహ్లీ మాట్లాడాడు. జాన్సన్ తో గొడవ జస్ట్ బాలింగ్ సరిగా లేదని మాత్రమే జరిగిందని చెప్పాడు కొహ్లీ . అయినా వారు కోపంగా మాట్లాడడం వల్లే గొడవ జరిగినట్లు చెప్పాడు. ఇలా ప్రతి విషయంలో కొహ్లీ కి ఏదో ఒక గొడవ జరుగూతూనే ఉంది.
కొహ్లీ గేమే కాదు చిరాకు పెడితే గొడవ కూడా బాగా పడతాడని నెటిజన్ల టాక్. ఇలా ప్రతి సిట్యువేషన్ లోను అయితే ప్లేయర్స్ తోను లేదా జర్నలిస్టులతో కొహ్లీ కి బాగానే గొడవలు జరిగాయి. తర్వాత సర్ధుమణిగినా ..కొహ్లీ ది కాస్త దూకుడు మనస్థతత్వమని చెబుతుంటారు ప్లేయర్లు.