viral: గన్ ను సబ్బుతో తోమిన మహిళ..వీడియో చూస్తే తెగ నవ్వుకుంటారు !

చీర కట్టుకుని ఉన్న ఓ మహిళ పిస్టల్‌ను పట్టుకుని దానికి సబ్బు పెట్టి, బ్రష్‌తో రుద్దుతూ ..నీటితో క్లీన్ చేస్తుంది. అక్కడే దాదాపు మూడు నాలుగు గన్స్ ఉన్నాయి.


Published Aug 12, 2024 06:05:00 PM
postImages/2024-08-12/1723466249_guns.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పాపం ..ఏదో సరదా కోసం ఏదో చేస్తారు..అది కాస్త చుట్టు తిరిగి కాళ్లకు చుట్టుకుంటుంది. అటువంటి ఘటనే రీసెంట్ గా మధ్యప్రదేశ్ లో జరిగింది. ఓ లేడీ సబ్బుతో బట్టలు ఉతుకుతున్నట్లే గన్ ను తెగ రుద్దిరుద్ది  తోముతుంది. ఇది వెనుకున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. ట్విస్ట్ ఏంటంటే..సోషల్ మీడియాలో పెట్టినట్టు అతనికే తెలీదు..పాపం ..తన అకౌంట్ లో ఎవ్వరు చూడకుండా పెట్టుకున్నాడనుకున్నాడట. కాని తెలీకుండా పబ్లిక్ లో పెట్టేసరికి వీడియో కాస్త వైరల్ అయ్యి ...గిర గిర తిరుగుతూ ..పోలీసులకు కనిపించింది.దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అక్రమ ఆయుధాల ఫ్యాక్టరీ గుర్తించారు.


వీడియోలో ఉన్న దాని ప్రకారం.. చీర కట్టుకుని ఉన్న ఓ మహిళ పిస్టల్‌ను పట్టుకుని దానికి సబ్బు పెట్టి, బ్రష్‌తో రుద్దుతూ ..నీటితో క్లీన్ చేస్తుంది. అక్కడే దాదాపు మూడు నాలుగు గన్స్ ఉన్నాయి. ఈ వీడియోను చూసిన పోలీసుల బృందం గణేశ్ పురా ప్రాంతంలోని ఒక ఇంట్లో సోదాలు చేసింది. వారికి ఆయుధాలు కనపడ్డాయి. ఆరు నెలలుగా వీరు ఈ ఆయుధాల యూనిట్ ను గుట్టుగా నడుపుతున్నారు. మహువా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ పవన్ సింగ్ మీడియాకు తెలిపారు.


ఆ అక్రమ ఆయుధ ఫ్యాక్టరీ నుంచి మూడు దేశీయ తుపాకులు, తయారీలో ఉన్న పలు ఆయుధాలు, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో కారణంగా భారీగా ఆయుధాలు తయారుచేసే ముడిసరుకు దొరికిందని తెలిపారు.

 

Related Articles