ఈ ముసలి బరువు ఎంతో తెలుసా 700 కేజీలు..16 అడుగుల పొడుగు. ఈ ముసలి గురించి కొన్ని ఇంట్రస్టింగ్ పాయింట్స్ తెలుసుకుందాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నీళ్లలోను , నేలమీద బ్రతికేవాటిని ఉభయచర జీవులు అంటారు.అలాంటి ఉభయ చర జీవుల్లో మొసలి చాలా ప్రమాదకరమైనది..బలమైనది. ఏనుగుని సైతం చాలా ఈజీగా బంధిస్తుంది. అలాంటి మొసళ్లలో ఈ ముసలి అతి పురాతనమైనది దీని వయసు 123 యేళ్లు. ఇప్పటికి హెల్దీ . అయితే ఈ ముసలి బరువు ఎంతో తెలుసా 700 కేజీలు..16 అడుగుల పొడుగు. ఈ ముసలి గురించి కొన్ని ఇంట్రస్టింగ్ పాయింట్స్ తెలుసుకుందాం.
ఓ గిరిజన తెగ దీని బాధపడలేక 1903లో ప్రసిద్ధ వేటగాడు సర్ హెన్రీ న్యూమాన్ ని ఆశ్రయించారు. అవసరం ఆయితే వదించమని కూడా చెప్పారు. అయితే ఆ హెన్రీ వల్లే మనిషి మాంసం తినే మొసలి ఇంకా బతికే ఉందని తెలిసింది. అయితే ఆ హంటర్ హెన్రీ ఈ భారీ మొసలిని చంపకుండా సజీవంగా పట్టుకున్నాడు. పట్టుకొని ఆఫ్రికాలోని స్కాట్ బర్గ్ లోని క్రోక్ వరల్డ్ కన్జర్వేషన్ సెంటర్ కు పంపాడు. ఆ వేటగాడి గుర్తుగా ఈ ముసలికి అతని పేరే పెట్టారు. నిజానికి ప్రకృతి లో అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో హెన్రీ ఒకటి.
ఈ మొసలి జాతులు సరస్సులు, నదులు, చిత్తడి నేలలతో సహా వివిధ జల వాతావరణాలలో నివసిస్తాయి. ఈ ప్రత్యేక నైలు జాతి మొసలి తరచుగా జీబ్రాలు, పోర్కుపైన్స్ వంటి జంతువులను వేటాడుతుంది. అయితే ఈ భయంకరమైన మొసళ్ల వల్ల ప్రతి సంవత్సరం వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా చాలా రేర్ బ్రీడ్ .
హెన్రీకి ఆరు 6 ఆడ మొసళ్లతో సంబంధాలు ఉన్నాయి. దీని పిల్లల సంఖ్య 10 వేలకు పైగా ఉంది. అయితే ఆడమొసళ్లు దీని బ్రీడ్ కాకపోయినా ..పుట్టిన 10 వేల మొసళ్లు హెన్రీ బ్రీడ్ మొసళ్లే. ఇప్పుడు క్వీన్స్‌లాండ్ తీరంలోని గ్రీన్ ఐలాండ్‌లోని మెరైన్‌ల్యాండ్ మెలనేసియా మొసలి ఆవాసంలో ఉంది. దీని పిల్లలు కూడా అక్కడే సురక్షితంగా ఉన్నాయి. అయితే కొంతమంది అత్యంత భయంకరమైన బ్రీడ్స్ ను కాపాడడం వల్ల మానవజాతికి మంచిది కాదని కూడా అంటున్నారు. జంతుప్రేమికులు మాత్రం భూమ్మీద వాటికి కూడా హక్కు ఉందంటున్నారు.