ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వినాయక ప్రతిమలు కొలువుదిరాయి. మొత్తం తొమ్మిది రోజులపాటు భక్తులంతా భక్తిశ్రద్ధలతో గణపతిని పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులు గణపతికి సంబంధించిన పారాయణం,గణపతి కథ, చరిత్ర తెలుసుకుంటూ
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వినాయక ప్రతిమలు కొలువుదిరాయి. మొత్తం తొమ్మిది రోజులపాటు భక్తులంతా భక్తిశ్రద్ధలతో గణపతిని పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులు గణపతికి సంబంధించిన పారాయణం, గణపతి కథ, చరిత్ర తెలుసుకుంటూ ఉంటారు. ఇలా మనం ఎంతో భక్తితో పూజించే వినాయకుడికి పెళ్లి జరిగిందా.. ఆయన పెళ్లి చేసుకునే ముందు ఏదైనా లవ్ స్టోరీ నడిపించారా.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
గణపతిని ఎంతో ప్రేమ, తెలివైన దేవుడిగా కొలుస్తారు. అలాంటి గణపతి ఏనుగు తల, బొజ్జ ఉండడం వల్ల ఆయనను ఏ అమ్మాయి చేసుకోవడానికి ఇష్టపడకపోవడంతో ఆయనే ఒక వధువును కనుగొన్నాడు. తన పెళ్లి కోసం ఇతర దేవుళ్ళ వివాహాలలో సమస్యలు సృష్టించడం ప్రారంభించాడట.
ఈ విధంగా ప్రతి పెళ్లిలో వినాయకుడు ఇబ్బంది పెట్టడం వల్ల దేవతల అంతా కలిసి శివుడి దగ్గరికి వెళ్లి పరిష్కారం చూపించమని అడిగారు. కానీ శివుడు దగ్గర పరిష్కారం లేకపోవడంతో, పార్వతీదేవి మీరంతా కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్లి చెప్పండి అని చెప్పిందట. వెంటనే దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్లి విషయం అంతా చెప్పారు. దీంతో బ్రహ్మ బుద్ది, సిద్ది అనే ఇద్దరు దేవతలను సృష్టించి గణేశుడికి వివాహం జరిపించారట.
ఆ తర్వాత గణేశుడు ఆ ఇద్దరితో చాలా ప్రేమతో ఉండేవారట. కొన్నాళ్ళకి వీరికి శుభా, లాభ అనే ఇద్దరు కుమారులు జన్మించారట. సంతోషిమా అనే కుమార్తె కూడా ఉందట. ఈ విధంగా గణపతి ప్లానింగ్ తో తన పెళ్లి చేసుకోవడానికి చక్కని మార్గాన్ని ఎంచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.