Vijaydevarakonda:మీది రాయలసీమా..విజయ్ దేవరకొండతో నటించే ఛాన్స్.! 2024-06-25 08:44:05

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) ఎంతటి ప్రాచుర్యం పొందారో మనందరికీ తెలుసు. ఈయనకు రౌడీ హీరోగా మంచి పేరు వచ్చింది.  అలాంటి విజయ్ దేవరకొండ ఖుషి(Kushi) సినిమా తర్వాత ఇంకా ఏ సినిమాలో నటించలేదు. యంగ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తో ఓ సినిమా చేయబోతున్నారు.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ మూవీ వీడి14 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నది.

మీడియాటిక్ యాక్షన్ డ్రామా, బ్యాక్ డ్రాప్ లో వస్తున్నటువంటి ఈ చిత్రం  కోసం కాస్టింగ్ కాల్ ప్రకటన విడుదలైంది. వీడి14లో నటించే అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఈ సినిమా మొత్తం అనంతపురం, కడప, కర్నూల్, తిరుపతి  ప్రాంతాల్లో జరుగుతుందట.  జూలై 1వ తేదీ నుంచి జూలై 9వ తేదీ వరకు ఈ ఆడిషన్స్ నిర్వహించబోతోంది చిత్ర యూనిట్. ఈ ఆడిషన్స్ లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని వారికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారట. రాయలసీమ యాసలో అదరగొట్టే వారికి ఇది ఒక బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు.

ఈ షూటింగ్ మొత్తం రాయలసీమలో జరుగుతున్న సందర్భంగా  మాట్లాడి ప్రతిభ ఉంటే చాలని మూవీ టీం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే ఆడిషన్స్ టైం ప్లేస్ వివరాలను తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగినటువంటి రాయలసీమ వ్యక్తులు ఎవరైనా సరే ఈ ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు. సెలెక్ట్ అయితే మాత్రం రౌడీ హీరోతో నటించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే విజయ్ తో టాక్సీవాలా మూవీ తీశారు రాహుల్. మళ్లీ వీరి కాంబోలో రెండో సినిమా రావడానికి సిద్ధమవుతోంది.