Nm: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఫేమస్ క్రియేటర్.?

కంటెంట్ క్రియేటర్ గా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన నిహారిక ఎన్ఎం గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్న మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది.


Published Jul 04, 2024 05:53:21 AM
postImages/2024-07-04/1720089139_niharika.PNG

న్యూస్ లైన్ సినిమా: కంటెంట్ క్రియేటర్ గా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన నిహారిక ఎన్ఎం గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్న మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ రోజు ఆమె బర్త్ డే సందర్భంగా గీతా ఆర్ట్స్ సంస్థ విశెస్ అందిస్తూ టాలీవుడ్ లోకి వెల్కమ్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చెన్నైలో పుట్టిన నిహారిక బెంగళూరులో పెరిగింది. యూఎస్ కాలిఫోర్నియాలోని చాప్ మాన్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసింది. థియేటర్ ఆర్ట్స్ మీద చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న నిహారిక తన పదో తరగతిలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. వివిధ అంశాలపై తన అభిప్రాయాలు తెలిపేలా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సబ్ స్క్రైబర్స్‌ను ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియాలో ఎంటర్ టైన్ మెంట్, కామెడీ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. నిహారికకు సోషల్ మీడియాలో 6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల యూట్యూబ్ ఆధ్వర్యంలో జరిగిన క్రియేటర్స్ ఫర్ ఛేంజ్ కార్యక్రమంలో ఇండియా నుంచి వరుసగా రెండోసారి రిప్రజెంట్ చేసింది. కొన్ని ముఖ్యమైన సామాజికాంశాలపై అవేర్ నెస్ తెచ్చేలా నిహారిక కంటెంట్ క్రియేట్ చేస్తోంది. తను చదువుకున్న యూఎస్ కాలిఫోర్నియా చామ్ మాన్ యూనివర్సిటీలో నిహారిక ఎన్ఎం కెరీర్ లో ఎదిగిన విధానంపై కేస్ స్టడీ చేస్తుండటం విశేషం. ఇప్పుడు తెలుగులో కూడా నిహారిక ఎన్ఎంకు మంచి భవిష్యత్తు ఉంటుందని సినీ జనాలు అనుకుంటున్నారు.

 

Related Articles