టీడీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: టీడీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆదివారం సోషల్ మీడియా వేదికగా షర్మిల ప్రభుత్వాన్ని నిలదీసింది. గ్రూప్2, డిప్యూటీ డీఈవో పోస్టుల ఎంపికలో 1:100 విధానాన్ని అనుసరించినట్లే.. గ్రూప్ 1 మెయిన్స్‌కి సైతం 1:100 నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలకు మధ్య సమయం తక్కువగా ఉందని తెలిపారు. కేవలం 3 వారాల వ్యత్యాసంలోనే రెండు పరీక్షలు జరగడం, గ్రూప్ 1 సిలబస్‌ను రివిజన్ చేయలేకపోవడం, కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్ లోనే ప్రిలిమ్స్ పరీక్షలు పెట్టడం లాంటి కారణాలతో నష్టపోయామని అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారని ఆమె తిపారు. అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి దీనిపై వెంటనే సాధ్యసాద్యాలు పరిశీలించి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.