BRS: RTV, రవిప్రకాష్‌కు నోటీసులు

 తప్పుడు ప్రచారం చేయవద్దని ఇప్పటికే మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు మార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. BRSపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. 


Published Aug 18, 2024 03:59:17 PM
postImages/2024-08-18//1723976957_ktrrtv.jpeg

న్యూస్ లైన్ డెస్క్: తమ పార్టీపై తప్పుడు వార్తలు ప్రసారం చెయ్యడమే కాకుండా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా ఛానళ్లపై BRS పంజా విసిరింది. BRS పార్టీ త్వరలోనే బీజేపీలో విలీనం కానుందని పలు మీడియా ఛానళ్లు గత కొంత కాలంగా తప్పుడు వార్తలు రాసారం చేస్తున్న విషయం తెలిసిందే. 

ఇటువంటి తప్పుడు ప్రచారం చేయవద్దని ఇప్పటికే మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు మార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. BRSపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. 

అయినప్పటికీ  RTV, యూట్యూబర్ రవిప్రకాష్ BRS బీజేపీలో విలీనం కానుందంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. దీంతో BRS ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. RTV, రవిప్రకాష్‌కు BRS నాయకులు ఆదివారం నోటీసులు పంపించారు. తమ పార్టీపై తప్పుడు వార్తలు ప్రచారం చేసిన రవిప్రకాష్ వివరణ ఇవ్వాలని ఇందులో పేర్కొన్నారు. 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu brs social-media socialmedia

Related Articles