Mr Bachchan:"మిస్టర్ బచ్చన్"పై హరీష్ శంకర్ రెస్పాన్స్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ క్యారెక్టర్లు చేసే హీరో ఎవరన్నా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది  మాస్ మహారాజా రవితేజ మాత్రమే. ముందుగా ఇండస్ట్రీలోకి  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ


Published Aug 15, 2024 06:40:17 PM
postImages/2024-08-15/1723727417_mrbahchan.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ క్యారెక్టర్లు చేసే హీరో ఎవరన్నా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది  మాస్ మహారాజా రవితేజ మాత్రమే. ముందుగా ఇండస్ట్రీలోకి  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి  స్టార్ హీరోగా మారారు. అలాంటి రవితేజ  మాస్, కామెడీ, ఎమోషనల్, ఇలా ఏ చిత్రమైనా సరే  అద్భుతంగా నటించే చతురత కలిగిన హీరో.. అలాంటి రవితేజ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించి  అనేక అవార్డులు రివార్డులు పొందారు. అలాంటి ఆయన హీరోగా తాజాగా వచ్చిన చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ చిత్రం గ్రేట్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది.  ఈ సినిమాలో రవితేజ సరసన  భాగ్యశ్రీ బోరుసే  కథానాయకగా చేసింది.

అంతేకాకుండా ఇందులో సిద్దు జొన్నలగడ్డ క్యామీయో రోల్  మరింత ఆకట్టుకుందని చెప్పవచ్చు. రీమేక్ సినిమా అయిన  ఏమాత్రం అది కనిపించలేదు.కానీ ఈ చిత్రాన్ని కాస్త వెరైటీగా చూపించడంలో హరీష్ శంకర్ వెనుకబడ్డారని చెప్పవచ్చు.  దీంతో ఈ సినిమా చూసిన చాలామంది మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. ఈ చిత్రంపై హరీష్ శంకర్ తాజాగా స్పందించారు. చాలావరకు మిక్స్డ్ రివ్యూస్ మిక్స్డ్ రేటింగ్స్ వస్తున్నాయి.

ఇది మాకు కొత్తఏమి కాదు.  చాలా సినిమాలకు ఇలా జరిగింది. ముఖ్యంగా ఎక్స్ లో నెగిటివ్ కంటే పాజిటివ్ రివ్యూస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. హాలిడేస్ కాబట్టి సినిమా మా అంచనాలు దాటుతుందని అనుకుంటున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

newsline-whatsapp-channel
Tags : news-line ravi-teja harish-shankar mr-bachchan bagyasri-boorse

Related Articles