తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి గుర్తింపుతో దూసుకెళ్లిన హీరోయిన్లలో అనిత కూడా ఒకరు. నువ్వు నేను అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఆ
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి గుర్తింపుతో దూసుకెళ్లిన హీరోయిన్లలో అనిత కూడా ఒకరు. నువ్వు నేను అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నిన్న ఇష్టపడతాను, ముసలోడికి దసరా పండగ, శ్రీరామ్ వంటి సినిమాల్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో పుల్ స్టాప్ పెట్టి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడ పలు సినిమాలు, సీరియల్స్ లో నటిస్తూ బిజీ అయిపోయింది.
అలాంటి ఈ కథానాయిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తండ్రిని తలుచుకొని కన్నీరు పెట్టింది. తప్పు చేశానంటూ ఎమోషనల్ అయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మా నాన్నకు విపరీతమైనటువంటి తాగుడు అలవాటు ఉండేది. దానివల్ల నేను ఆయనపై కోపాన్ని పెంచుకున్నాను. ప్రతి ఆడపిల్లకు తండ్రి ఎలా ఉన్నా ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తుంది. ప్రస్తుతం ఆయన గురించి నేను పెద్దగా మాట్లాడను కానీ ఆయనను మిస్సై ఏళ్లు గడుస్తోంది. సారీ నాన్న నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను..
నా కొడుకు పుట్టాక గాని నీ ప్రేమేంటో అర్థం కాలేదు. నువ్వు నా కొడుకుని కలిసి తనతో ఆడుకోవాలి.. నేను పెద్ద తప్పు చేశాను నిన్ను తాగుబోతు అంటూ నిందిస్తూ కోపడ్డాను. నువ్వు మద్యానికి బానిసై దాన్నుంచి బయటపడలేక పోతున్నావని అస్సలు అర్థం చేసుకోలేకపోయాను. అంత కోపాన్ని చూపించక పోయి ఉంటే బాగుండేది. అప్పుడు నాకు చిన్న వయసు కావడంతో నాన్న అంటే ఏంటో అర్థం కాలేదు. ప్రస్తుతం నాన్న లేడు అనే బాధ అనిపిస్తుందని అనిత ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.