సినిమా రంగంలో నటినటులు, దర్శకనిర్మాతలు, హీరో హీరోయిన్ల అంద చెందాలతో పాటుగా కాస్త సెంటిమెంట్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. అలా వందలాది సినిమాలకు సెంటిమెంట్ గా వస్తోంది ఈ చెట్టు. ప్రతి చిత్రంలో
న్యూస్ లైన్ డెస్క్: సినిమా రంగంలో నటినటులు, దర్శకనిర్మాతలు, హీరో హీరోయిన్ల అంద చెందాలతో పాటుగా కాస్త సెంటిమెంట్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. అలా వందలాది సినిమాలకు సెంటిమెంట్ గా వస్తోంది ఈ చెట్టు. ప్రతి చిత్రంలో ఏదో ఒక చిన్న సీన్ అయినా ఈ చెట్టు దగ్గర షూటింగ్ చేస్తే సినిమా 100 రోజులు ఆడడం పక్కా అని భావిస్తారు. అలాంటి ఈ సినిమా చెట్టు కూలిపోవడం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. ఇంతకీ ఆ చెట్టు ఎక్కడ ఉంది వివరాలు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఈ సినిమా చెట్టు ఉంది. ఈ చెట్టు వయసు దాదాపుగా 140 నుంచి 150 సంవత్సరాలు ఉంటుందట. ఈ చెట్టు కింద ఇప్పటికే 300 కు పైగా సినిమాలు షూటింగ్ జరిపారట. 1975 లో రిలీజ్ అయిన పాడి పంటల నుంచి మొదలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజరు వరకు ఈ చెట్టు కింద షూటింగ్ జరుపుకున్నాయట.
ఇందులో మూగమనసులు, పద్మ వ్యూహం, త్రిశూలం, సీతారామయ్యగారి మనవరాలు, వంటి ఎన్నో చిత్రాలు ఈ చెట్టు కింద షూటింగ్ చేశారట. అంతేకాకుండా డైరెక్టర్ కె విశ్వనాథ్, జంధ్యాల, రాఘవేంద్రరావులకు ఈ సినిమా చెట్టు ఎంతో కలిసి వచ్చిందని, వారి ప్రతి సినిమాలో ఈ చెట్టు కింద తప్పక షూటింగ్ ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. అంతేకాకుండా దర్శకుడు వంశీ కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ చెట్టు కింద భోజనం చేసేవారట.
అంతేకాదు ఈ సినిమా చెట్టు వల్లే ఆ గ్రామానికి అంతలా పేరు వచ్చిందని ఆ గ్రామస్తులు అంటున్నారు. అలాంటి ఈ చెట్టు సడన్ గా కూలిపోవడంతో గ్రామంలోని వారంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ చెట్టు వల్లే మా గ్రామానికి మంచి పేరు వచ్చిందని, అలాంటి ఈ చెట్టు కూలిపోవడం మాకు తీరని నష్టమని ఎమోషనల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ చెట్టుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
https://x.com/bigtvtelugu/status/1820393166614544459