మరికొంతమంది నిద్రపోరు. మందులు మాత్రలు వాడినా నిద్రపోరు. అయితే ఆ నిద్ర వరం ఉన్నవాళ్లు మాత్రం ఈ పోటీలో వందకు వంద శాతం ఫిట్ అయిపోతారు. ఎలా గెలుచుకోవాలో చెప్తాం చూడండి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నిద్రని ..ఆకలిని డబ్బుతో కొనలేం . ఇది అందరికి తెలిసింది అయితే ప్రశాతంగా నిద్రపోతే మాత్రం పదిలక్షల రూపాయిల ప్రైజ్ మనీ వస్తుందంటున్నారు. కొంత మందికి నిద్ర వరం ...మరికొంతమందకి శాపం. ఇలా కునుకు తీస్తే నిద్రపోతారు కొందరు. మరికొంతమంది నిద్రపోరు. మందులు మాత్రలు వాడినా నిద్రపోరు. అయితే ఆ నిద్ర వరం ఉన్నవాళ్లు మాత్రం ఈ పోటీలో వందకు వంద శాతం ఫిట్ అయిపోతారు. ఎలా గెలుచుకోవాలో చెప్తాం చూడండి.
నిద్ర అంటే ఓ గంటో ...రెండు గంటలో కాదు ...ఏకంగా రెండు నెలలు నిద్రపోవాలి. అప్పుడే 10 లక్షలు గెలుచుకుంటారు. బెంగుళూరుకి చెందిన ‘వేక్ ఫిట్’ అనే స్టార్ట్ అప్ ఈ సూపర్ అవకాశాన్ని కల్పిస్తుంది. వేక్ ఫిట్ అనేది పరుపులు తయారు చేసే కంపెనీ. ఈ కంపెనీ వేక్ ఫిట్ స్లీప్ పేరిట ఇంటర్న్షిప్ డ్రైవ్ ని నిర్వహిస్తుంది. అయితే ఇప్పటి వరకు మూడు సీజన్లు జరిపింది. ఇది 4వ సీజన్. దీనికి సంబంధించి అప్లికేషన్ రిలీజ్ చేసింది. మూడవ సీజన్లో బెంగళూరుకి చెందిన సైష్వారి పాటిల్ అనే మహిళా పాల్గొని గెలిచింది. ఇందులో గెలిచి ఆమె ఏకంగా 9 లక్షలను గెలుచుకున్నారు. అలాగే రెండవ సీజన్లో కోల్ కతాకి చెందినా త్రిపర్ణ చక్రవర్తి విజేతగా నిలిచి 5 లక్షల డబ్బుని గెలుచుకున్నారు.
ఈ జాబ్ ను రెండు నెలలు చెయ్యాల్సిందే. మీరు చెయ్యల్సిన పని కేవలం మీ బెడ్ పై నిద్రపోవడమే. రోజుకి 9 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. ఇందులో సెలక్ట్ అయిన వారికి స్టై ఫండ్ కూడా ఉంటుంది. అది లక్ష రూపాయిలు. తిండి పెట్టి..అవసరాలకి మాత్రమే పైకి లేవాలి. లేదంటే నిద్రపోవడమే . అలా నిద్రపోతే 10 లక్షలు మీవే.