Bike Stunts : రీల్స్ కోసం బైక్ స్టంట్స్.. అదుపు తప్పి

రీల్స్, వీడియోల కోసం చేసే ప్రమాదకర విన్యాసాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇతరుల దృష్టిని ఆకట్టుకోవడానికి స్టంట్స్ చేస్తూ తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.


Published Jul 21, 2024 03:46:09 AM
postImages/2024-07-21/1721550991_bikestunnt.jpg

న్యూస్ లైన్ డెస్క్ : సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్లు వచ్చేందుకు.. ఎక్కువమందిని ఆకట్టుకునేందుకు స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఓ యువకుడు చేసిన బైక్ స్టంట్ ప్రాణాలకే ముప్పు తెచ్చింది. బైక్ వెనకాల స్నేహితుడిని కూర్చోబెట్టుకొని స్టంట్స్ చేస్తుండగా అదుపు తప్పి ఒకరి ప్రాణాలు పోగా.. మరో యువకుడు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. హయత్ నగర్ అంబర్ పేట ఈ ఘటన జరిగింది. శనివారం రోజు సాయంత్రం నలుగురు స్నేహితులు హైదరాబాద్ – విజయవాడ హైవేపై వర్షంలో బైక్ స్టంట్స్ చేశారు. ఒక బైక్ మీద ఉన్న ఇద్దరు యువకులు స్టంట్స్ చేస్తుంటే.. మరో బైక్ మీద ఉన్న యువకులు వీడియో తీస్తున్నారు. బైక్ ముందు టైరు గాల్లోకి లేపి స్టంట్ చేస్తుండగా అదుపు తప్పి ఇద్దరు కింద పడ్డారు. ఈ ఘటనలో వెనకాల కూర్చున్న యువకుడు ప్రాణాలు కోల్పోగా.. బైక్ నడిపిన యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana hyderabad crime hyderabadtrafficpolice

Related Articles