Laxmidevi:మంచి రోజులు వచ్చే ముందు కనిపించే 5 సంకేతాలు.!

పూర్వకాలంలో కోటి విద్యలు కూటి కోసమే అనే సామెత ఉండేది. కేవలం తిండి దొరికితే చాలు అనే ఆలోచనతో వర్క్ చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో తిండి లేకున్నా పర్లేదు కానీ కోట్లు సంపాదించాలని


Published Aug 25, 2024 07:48:31 AM
postImages/2024-08-25/1724552311_laxmi.jpg

న్యూస్ లైన్ డెస్క్: పూర్వకాలంలో కోటి విద్యలు కూటి కోసమే అనే సామెత ఉండేది. కేవలం తిండి దొరికితే చాలు అనే ఆలోచనతో వర్క్ చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో తిండి లేకున్నా పర్లేదు కానీ కోట్లు సంపాదించాలని ఆలోచనకు వచ్చారు.  ఏ పని చేసైనా సరే డబ్బు సంపాదించాలి అని చాలామంది చెబుతూ ఉన్నారు. మరి డబ్బు సంపాదించడం కొంతమందికి చాలా సులువు. కానీ మరి కొంతమంది ఎంతో కష్టపడతారు. అలాంటి డబ్బును మనం లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తాం. అలాంటి లక్ష్మీదేవి మన మన ఇంట్లో అడుగు పెట్టే ముందు కనిపించే సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..ఎక్కడైతే శ్రీమహావిష్ణువుని లక్ష్మీ సమేతంగా పూజిస్తారు  అక్కడ తన ధాన్యాలు ఎక్కువగా ఉంటాయట.

#1.  నల్ల చీమలు:
 ఒక ధారల వచ్చి ఏదైనా పదార్థం తింటూ ఉన్నట్లయితే  మీకు లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిందని త్వరలోనే ధనప్రాప్తి కలగబోతుందని అర్థం చేసుకోవాలి. నల్ల చీమలు వస్తే మీ కుటుంబం మంగళప్రదంగా జీవిస్తుందట. అలాంటి చీమలకు కాస్త గోధుమపిండి చల్లినట్టయితే భగవంతునికి మీకు అనుసంధానం అయినట్టే. 

#2. పక్షి గూడు:
పక్షి గూడు అనగానే మనకు అడవుల్లో ఎక్కువగా పక్షులు గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. కానీ అలాంటి పక్షులు మన ఇంటి పరిసరాల్లో కిటికీ పక్కన లేదంటే మన గుమ్మం  పక్కన ఏదో ఒక దగ్గర పక్షి గూడు పెట్టుకుంది అంటే మనకు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని అర్థం. ఈ విధంగా లక్ష్మీదేవి వచ్చే ముందు పక్షులు తేనెటీగలు, గూళ్లు పెడుతూ ఉంటాయట. 

#3. దురద:
 హస్త సాముద్రిక శాస్త్రాల ప్రకారం ఎప్పుడైతే అరచేతిలో, అరికాలలో దురద పడుతుందో మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుందని అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి ఈ అరచేతిలో దురద వల్ల ధన నష్టం కూడా జరుగుతుందట. ఒకవేళ మీకు ఎడమ చేతి మీద దురద ఉంటే మీరు తొందరలోనే ధనవంతులవుతున్నారని సంకేతం. అదే కుడి చేయి అరచేతిలో దురద పెడితే మీరు డబ్బు కోల్పోతున్నారని అర్థం చేసుకోవాలి.

#4. చెరుకు:
మీరు బయటకు వెళ్తున్న సమయంలో చెరుకు గడ్డ కనిపిస్తే మీరు త్వరలోనే విజయం సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి. వ్యాపారస్తులయితే ధన లాభాన్ని పొందబోతున్నారని అర్థం చేసుకోవాలి. 

#5.గుడ్లగూబ:
 మన శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపిస్తే అది ఎంతో మంచి సూచకం. గుడ్లగూబ కనిపించిన మీకు తన ప్రాప్తి కలగబోతుందని అర్థం. ఒకవేళ గుడ్లగూబ ఇంట్లోకి వస్తే మాత్రం చెడు పలితాలు ఉంటాయట. అలాంటి సమయంలో కొన్ని పూజలు చేసి ఆ దుష్ఫలితాన్ని తొలగించుకోవాలని పండితులు అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu laxmidevi money leazard good-time

Related Articles