ఈ టైంలో అంజలి తమిళ హీరో జై తో ప్రేమలో పడింది. కలిసి సహజీవనం చేశాక ...జై అసలు రంగు చూపించాడు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హీరోయిన్ అంజలి గురించి తెలుసుగా ..తెలుగు లో కంటే తమిళ్ లో చాలా ఫేమస్ అయ్యింది. తెలుగులో అంజలి చేసిన ఫస్ట్ సినిమా ఫొటో. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర అంతగా ఆకట్టుకోలేదు. మళ్లీ తెలుగులో వచ్చిన జర్నీ సినిమా అంజలిని ఫామ్ లోకి తీసుకోచ్చింది. అప్పుడే జర్నీ సినిమా హీరోతో ప్రేమలో పడింది. కాని ఆ రిలేషన్ ఎన్నో రోజులు ఉండలేదు. అసలు ఎందుకు విడిపోయారో కూడా తెలీకుండా సైలెంట్ గా విడిపోయారు.
కరతు తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. వరుస సినిమాలు చేస్తూ.. కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. వెంకటేష్ , బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. కెరీర్ పీక్ టైం లో వ్యక్తిగత గొడవలతో కొన్నాళ్లు సినిమాలకు దూరం అయింది. ఈ టైంలో అంజలి తమిళ హీరో జై తో ప్రేమలో పడింది. కలిసి సహజీవనం చేశాక ...జై అసలు రంగు చూపించాడు. తనను అంతగా మోసం చేసిన వాడితో అంజలి బ్రేకప్ చెప్పేసింది.
అంజలితో రిలేషన్‌లో ఉన్న సమయంలో ఆమెతో సినిమాలు చేసే దర్శక, నిర్మాతలకు జై కండిషన్లు పెట్టేవాడట జై. అంజలి కి ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఫస్ట్ జై కి చెప్పాకే అంజలి వరకు వెళ్లాలని చెప్పేవారట. అలాగే అవుట్ డోర్ షూటింగ్‌లకి వెళ్లిన సమయంలో ఆమెతో పాటు జై కూడా వచ్చేవారట. ఆయన ఖర్చులు కూడా ఆ సినిమా నిర్మాత భరించాల్సి వచ్చేదట. కొన్ని హిట్టు సినిమా కాన్సప్ట్ లు ఫస్ట్ అంజలి దగ్గరకి వెళ్లినా ఈ సినిమా అంజలి చెయ్యదని చెప్పేసేవారట. మెల్లగా అంజలికి విషయం అర్ధమై పక్కకు పెట్టేసిందట.. అలా పెళ్లి అనుకున్న జంట మూన్నాళ్లకే ముక్కలయిపోయారు.