పర్సనల్ , ఫ్యామిలీ విషయాలు బయటపెడుతుంది. తను ప్రాణం గా ప్రేమించిన అబ్బాయి తనను ఎలా మోసం చేశాడో చెప్పింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో కిర్రాక్ సీత ఇప్పుడు అందరికి పరిచయమే. కాస్త బొంగురు గొంతులో .కర్లీ హెయిర్ లో భలే ఫాస్ట్ పిల్ల. స్టాండ్ తీసుకోవాలనుకుంటే ఏం జరిగినా వెనక్కి తగ్గదు. అయితే బిగ్ బాస్ హౌస్ లో కిర్రాక్ సీత ఓపెన్ అవుతుంది. పర్సనల్ , ఫ్యామిలీ విషయాలు బయటపెడుతుంది. తను ప్రాణం గా ప్రేమించిన అబ్బాయి తనను ఎలా మోసం చేశాడో చెప్పింది.
. ఈ సీజన్ 8 లో ఇప్పటి వరకూ మణికంఠకు సబంధించని విషయాలు మాత్రమే తెలుసు. అది కూడా అతను ఫస్ట్ వీక్ లో ఎమోషనల్ అయిపోయి.. తన విషయాలు ఒక్కొక్కటిగా చెపుతూ..వచ్చాడు. అయితే ఇఫ్పుడు సీత కథ గా చాలా ఎమోషనల్ గానే ఉంది. తాను లవ్ బ్రేకప్ కు సబంధిచిన విషయాన్ని వివరించింది. పెళ్ళి వరకూ వచ్చిన తన ప్రేమ ఎలా బ్రేకప్ అయ్యింది.. తాను ఎలా మోసపోయింది వివరంగా చెప్పింది. సన్ డే ఫన్ డే ఎపిసోడ్ లో తన బ్రేకప్ ముచ్చట్లు బయటపెట్టింది.
నేను ఓ అబ్బాయిని దాదాపు ఐదేళ్లకు పైన ప్రేమించాను. అతనితో డీప్ రిలేషన్ లో ఉన్నాను అన్నారు. చాలా కష్టపడి ఇంట్లో అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నా...వాళ్ల పేరెంట్స్ ను కూడా నేనే ఒప్పించాను. కాని ఎందుకో ఎప్పుడు ఓ ఫ్రెష్ అబధ్దం తో నా ముందుండేవాడు. పేరెంట్స్ రీజన్ చూపించి ...నన్ను వదిలించుకున్నాడు. కాని తరువాత నాకు తెలిసింది ఏంటంటే.. అతను నన్ను చీట్ చేశాడు. నన్ను మోసం చేయడానికే పక్కాగా ప్లాన్ వేసి ఇలా చేశాడని నాకు అర్ధం అయ్యింది అన్నారు సీత.
ఆ బాధను నేను భరించలేకపోయాను..తను మాత్రం హ్యాపీగా ఉన్నాడు. నేను డిప్రెషన్ కు వెళ్లిపోయాను. ఏడ్చాను..నాకు నేను తెలుసుకున్నాను. డాక్టర్ ను కలిశాను. కౌన్సిలింగ్ తీసుకున్నాను. డాక్టర్ నాకు ఒకటే చెప్పింది. మనసులో బాధ చెప్పుకుంటేనే నార్మల్ అవుతాం..నీ ఫ్రెండ్స్ తో మాట్లాడు..ఓపెన్ గా ..ఫ్రీ గా నీకు నచ్చిన ప్లేస్ లో తిరుగు..చదువు ...ప్రతి విషయాన్ని చాలా హ్యాపీగా ఆస్వాదించు. అప్పటి నుంచి లైఫ్ మారింది. వాడితో విడిపోయాకే నా లైఫ్ చాలా హ్యాపీ గా ఉంది. పెళ్లై ఉంటే ..నేను ఇక్కడికి వచ్చి ఉండేదాన్ని కాదు. థాంక్యూ గాడ్ అని తెలిపింది.